MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • IPO: దేశంలోనే అతిపెద్ద IPOకి రంగం సిద్ధం.. రూ. 37,700 కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా

IPO: దేశంలోనే అతిపెద్ద IPOకి రంగం సిద్ధం.. రూ. 37,700 కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా

IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సర్వీసెస్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ త్వరలో ఐపీఓకు రానుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి కంపెనీకి అనుమతి లభించింది. ప్రతిపాదిత ఐపీఓ అంచనా ప్రకారం దేశంలో అతిపెద్ద ఐపీఓ కానుంది.

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 28 2026, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో ప్లాట్‌ఫామ్స్ IPOకి SEBI ఆమోదం
Image Credit : Gemini AI

జియో ప్లాట్‌ఫామ్స్ IPOకి SEBI ఆమోదం

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్ ఇష్యూ కోసం జూన్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. తాజాగా ఆగస్టు 28న సెబీ నుంచి తుది వ్యాఖ్యలు అందినట్లు సమాచారం. ఐపీఓ ప్రక్రియలో సెబీ నుంచి వచ్చే తుది వ్యాఖ్యలు కీలకమైన దశగా భావిస్తారు. ఈ అనుమతి తర్వాత కంపెనీ ఐపీఓకు సంబంధించిన తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.37,700 కోట్లు సమీకరించే అవకాశం
Image Credit : Asianet News

రూ.37,700 కోట్లు సమీకరించే అవకాశం

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.37,700 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. కంపెనీ విలువను సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి విలువతో ఐపీఓ జరిగితే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచే అవకాశం ఉంది.

35
27 కోట్ల కొత్త షేర్ల జారీ
Image Credit : Asianet News

27 కోట్ల కొత్త షేర్ల జారీ

జియో ప్లాట్‌ఫామ్స్ సమర్పించిన డిటైల్ ప్రాస్పెక్టస్ ప్రకారం, కంపెనీ 27 కోట్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ తర్వాత ఈ కొత్త షేర్లు కంపెనీ మొత్తం ఈక్విటీ షేర్లలో సుమారు 2.9 శాతం ఉండనున్నాయి. కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను కంపెనీ తన వ్యాపార అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది.

45
దేశంలోనే అతిపెద్ద IPOగా మారే ఛాన్స్
Image Credit : X

దేశంలోనే అతిపెద్ద IPOగా మారే ఛాన్స్

రూ.37,700 కోట్ల సమీకరణ లక్ష్యం నెరవేరితే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రతిపాదిత ఐపీఓ సుమారు రూ.30,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా. దీంతో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ దానికంటే పెద్దదిగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

55
పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తి
Image Credit : X

పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తి

జియో ప్లాట్‌ఫామ్స్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ డిజిటల్ వ్యాపారానికి కీలకమైన సంస్థ. టెలికాం, డిజిటల్ సేవలు వంటి విభాగాల్లో జియో విస్తరించిన నేపథ్యంలో ఈ ఐపీఓపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఐపీఓ తేదీ, షేర్ ధర, రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయింపు వంటి పూర్తి వివరాలను కంపెనీ తదుపరి దశలో వెల్లడించే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
స్టాక్ మార్కెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved