MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం

Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం

Gold Price Hike: బంగారం కొనాలనుకునేవారికి మార్కెట్లు షాక్ ఇచ్చాయి. దసరా, దీపావళి పండగలు దగ్గరపడుతున్న వేళ పసిడి ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న గోల్డ్ రేట్స్‌కు తోడు తాజా పెరుగుదల కొనుగోలుదారులపై మరింత భారం పెంచుతోంది.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 23 2026, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మళ్లీ జోరందుకున్న బంగారం
Image Credit : Asianet News

మళ్లీ జోరందుకున్న బంగారం

కొంతకాలంగా బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే.. మరుసటి రోజు మళ్లీ పెరుగుతోంది. దీంతో ధరలు ఏ దిశగా వెళ్తాయో అర్థం కాక కొనుగోలుదారులు అయోమయంలో ఉన్నారు. తాజాగా మొన్నటి సెషన్‌లో కాస్త వెనక్కి తగ్గిన పసిడి.. ఈరోజు మాత్రం తిరిగి జోరందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,54,200కు చేరిన పసిడి
Image Credit : Getty

రూ.1,54,200కు చేరిన పసిడి

ఈసారి 24 క్యారెట్ల బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు ఏకంగా రూ.870 పెరిగింది. 22 క్యారెట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. పది గ్రాముల ధర రూ.800 వరకు పెరిగింది. అంటే ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ పెరుగుదల నేరుగా ఖర్చుపై ప్రభావం చూపనుంది.

హైదరాబాద్ మార్కెట్‌ను గమనిస్తే.. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.1,54,200గా ఉంది. అదే 22 క్యారెట్ల పసిడి గ్రాము రేటు రూ.1,41,350గా నమోదైంది. భారీ ధరల నేపథ్యంలో పండగ కొనుగోళ్ల విషయంలో చాలామంది ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక వెండి మార్కెట్ మాత్రం బంగారానికి భిన్నంగా ఉంది. ఈరోజు హైదరాబాద్‌లో సిల్వర్ రేట్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి రూ.2,55,000 వద్దనే కొనసాగుతోంది.

34
మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
Image Credit : google

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

అసలు బంగారం ధరలు మళ్లీ ఎందుకు పెరిగాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు, అమెరికా డాలర్ కదలికలు, మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అంతేకాదు.. కొంతకాలంగా తగ్గిన బంగారం డిమాండ్ మళ్లీ క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

44
మార్కెట్ పై పండగల సీజన్ ప్రభావం
Image Credit : Getty

మార్కెట్ పై పండగల సీజన్ ప్రభావం

మరోవైపు దేశీయ మార్కెట్లలో మాత్రం సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈరోజు సెన్సెక్స్ దాదాపు 180 పాయింట్ల లాభంతో 74,710 స్థాయి వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగి 23,380 వద్ద కొనసాగుతోంది.

అంటే ఒకవైపు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదులుతుంటే.. మరోవైపు పసిడి ధరలు మాత్రం మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా పండగల సీజన్ మొదలైన సమయంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు కీలకంగా మారింది.

ఇక ముందురోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ కదలికలు, గ్లోబల్ టెన్షన్స్, దేశీయ డిమాండ్ వంటి అంశాల ఆధారంగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ప్రస్తుతం మాత్రం పండగల వేళ పసిడి కొనాలనుకునేవారికి.. ఈరోజు ధరలు మరోసారి షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved