MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Cheapest Gold : ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే సిటీ ఏది? ఇక్కడ ఎందుకంత తక్కువ ధర?

Cheapest Gold : ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే సిటీ ఏది? ఇక్కడ ఎందుకంత తక్కువ ధర?

భారతదేశంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే నగరం ఏది? అక్కడ రేటు ఎందుకంత తక్కువగా ఉంటుంది? బంగారం అత్యధిక ధర ఉండే సిటీ ఏది? ఇందుకు కారణమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 31 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ ధరకే బంగారం దొరికే నగరమేది?
Image Credit : Gemini AI

తక్కువ ధరకే బంగారం దొరికే నగరమేది?

మనం రోజూ బంగారం ధర పెరిగిందనో లేక తగ్గిందనో వింటుంటాం… ఈ ధర దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు… ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా బంగారం ధర ఉంటుంది. మన హైదరాబాద్ లో ఒకలా, ఆర్థిక రాజధాని ముంబైలో మరోలా ధరలు ఉంటాయి. రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు, హ్యాండ్లింగ్ ఛార్జీల వల్ల ఒక్కో నగరంలో బంగారం ధర ఒక్కోలా ఉంటుంది. మరి ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే నగరం ఏదో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
త్రిస్సూర్ లో బంగారం ధర ఎందుకంత తక్కువ?
Image Credit : Getty

త్రిస్సూర్ లో బంగారం ధర ఎందుకంత తక్కువ?

భారతదేశ 'గోల్డ్ క్యాపిటల్' గా కేరళలోని ‘త్రిస్సూర్’ నగరం పేరుగాంచింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ త్రిస్సూర్ లో బంగారం ధర తక్కువగా ఉంటుంది… ఇందుకు కొన్ని కీలక ఆర్థిక కారణాలున్నాయి.

మొదటిది రవాణా ఖర్చులు (లాజిస్టిక్స్) తక్కువగా ఉండటం. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం సముద్ర మార్గంలో కేరళలోని కొచ్చి పోర్ట్‌కు చేరుకుంటుంది. ఈ త్రిస్సూర్ నగరం కొచ్చికి చాలా దగ్గరగా ఉండటంతో రవాణా, నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. ఈ ప్రయోజనం నేరుగా కస్టమర్లకు అందుతుంది… అందుకే ధర తగ్గుతుంది.

35
త్రిస్సూర్ లో భారీ మార్కెట్, నెట్‌వర్క్
Image Credit : Asianet News

త్రిస్సూర్ లో భారీ మార్కెట్, నెట్‌వర్క్

త్రిస్సూర్ బంగారు వ్యాపారానికి ఒక గ్లోబల్ సెంటర్‌గా ఉంది. ఇక్కడ భారీ స్థాయిలో గోల్డ్ ట్రేడింగ్ జరుగుతుంది. పెద్ద హోల్‌సేల్ మార్కెట్ ఉండటంతో వ్యాపారుల మధ్య పోటీ ఎక్కువ. కాబట్టి వ్యాపారులు తక్కువ లాభాలతో (Low margins) ఎక్కువ మొత్తంలో బంగారం అమ్మడానికి ముందుకొస్తారు. ఇది కూడా త్రిస్సూర్ బంగారం ధరలు తక్కువగా ఉండటానికి కారణం.

45
కేరళలో బంగారంపై తక్కువ పన్ను
Image Credit : Getty

కేరళలో బంగారంపై తక్కువ పన్ను

దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలపై జీఎస్‌టీ ఒకేలా ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాలు విధించే స్థానిక సెస్సులు, హ్యాండ్లింగ్ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అయితే కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బంగారంపై విధించే పన్నులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి…అందుకే కస్టమర్లకు తక్కువ ధరకే బంగారం లభిస్తోంది.

55
అత్యధిక ధరకు బంగారం లభించే సిటీ ఏది?
Image Credit : iSTOCK

అత్యధిక ధరకు బంగారం లభించే సిటీ ఏది?

మరోవైపు దేశంలోనే అత్యధిక ధరకు బంగారం అమ్ముడయ్యే నగరాల్లో ఢిల్లీ ముందుంది. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండటం, మెట్రో నగర నిర్వహణ వ్యయాలు, స్థానిక అదనపు పన్నుల కారణంగా డిల్లీలో బంగారం రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి… హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో బంగారం ధరలు తక్కువే.

మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకుంటే త్రిస్సూర్ అత్యంత అనుకూలమైన, లాభదాయకమైన మార్కెట్ అని నిపుణులు చెబుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంగారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
Gold Plated Bangles: అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు
Recommended image2
Gold Price Crash: మళ్లీ పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం..పాతాళానికి పడిపోతున్న పసిడి, సిల్వర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved