MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Dairy Business Tips : బాగా పాలిచ్చే గేదెలను ఎలా గుర్తించాలి? టాప్ 5 టిప్స్

Dairy Business Tips : బాగా పాలిచ్చే గేదెలను ఎలా గుర్తించాలి? టాప్ 5 టిప్స్

మీరు డెయిరీ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లేేదంటే ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఉన్నారా? అయితే మంచి పాడి గేదెలను సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 25 2026, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డెయిరీ బిజినెస్ టిప్స్
Image Credit : Gemini AI

డెయిరీ బిజినెస్ టిప్స్

నేటి యువత ఉద్యోగాల కంటే వ్యాపారం చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో బాగా చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్లు... కానీ ఇప్పుడు డిగ్రీలు, ఇంజనీరింగ్, ఎంబిఏలు చేసినవాళ్లు కూడా స్టార్టప్స్ ప్రారంభిస్తున్నారు. అయితే కొందరు కేవలం ఐటీ, టెక్నాలజీ అని కాకుండా వ్యవసాయాన్ని కూడా తమ వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అని కొందరు, మంచి డిమాండ్ ఉండే పండ్లు, పూలను పండిస్తూ మరికొందరు మంచి లాభాలు పొందుతున్నారు. ఇక మన సాంప్రదాయ పాడి పరిశ్రమను కూడా కొందరు యువత ఎంచుకుంటున్నారు.

అయితే పాడి పరిశ్రమ కొంచెం రిస్క్ తో కూడుకున్నది. ప్రాణమున్న జంతువులతో చేసే బిజినెస్ కాబట్టి డెయిరీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందులో అత్యంత కీలకమైన మంచి పాడి గేదెల ఎంపిక... అవి ఆరోగ్యంగా ఉండి అధికంగా పాలు ఇస్తేనే మంచి లాభాలు వచ్చేది. మరి గేదెలను కొనేటప్పుడు ఆరోగ్యంగా ఉందా? బాగా పాలు ఇస్తుందా? ఎలా తెలుసుకోవడం? ఇందుకోసం ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గేదె యాక్టివ్ గా ఉందో, లేదో తెలుసుకొండి
Image Credit : Getty

గేదె యాక్టివ్ గా ఉందో, లేదో తెలుసుకొండి

డెయిరీ బిజినెస్ ప్రారంభించేముందే పాడి గేదెల గురించి తెలుసుకోవడం మంచిది. ముందుగా ఎలాంటి గేదెలను కొనుగోలు చేయాలో తెలుసుకోవాలి. కొన్ని విషయాలను బట్టి గేదె మంచిదో, కాదో తెలుసుకోవచ్చు... అందులో కీలకమైనది దాని యాక్టివ్ నెస్.

గేదె కొనేముందు అది యాక్టివ్ గా ఉందో లేదో తెలుసుకోవాలి. ఇందుకోసం దాని ముక్కుపై చెమటను పరిశీలించాలి... ఎక్కువగా చెమట ఉందంటే ఈ గేదె యాక్టివ్ అని అర్థం. అంతేకాదు గేదె కళ్ళను బట్టి కూడా అది బద్దకంగా ఉంటుందా లేదా యాక్టివా అన్నది తెలుసుకోవచ్చు. కళ్లను చురుగ్గా కదిలిస్తూ అన్ని వైపులకు చూస్తూ హుషారుగా కనిపిస్తే అది మంచి పాడిగేదె అన్నట్లు.

35
బర్రె పొదుగు పరిశీలించండి
Image Credit : Gemini AI

బర్రె పొదుగు పరిశీలించండి

గేదెలు కొనుగోలు చేసేముందు దాని పొదుగును కచ్చితంగా పరిశీలించాలి... ఇది చాలా ముఖ్యం. బర్రె పొదుగు రెండుకాళ్ల మధ్యలో సరిగ్గా సెంటర్ లో ఉండాలి. ఒకవైపుకు పొదుగు వాలిపోయి ఉన్నా... టైట్ గా, ఫిట్ గా లేకున్నా ఆ బర్రెను కొనకపోవడమే మంచిది. ఇలాంటి బర్రెలు తక్కువగా పాలు ఇస్తాయి. ఆరోగ్యకరమైన పొదుగు కలిగివున్న బర్రెలనే పాడి పరిశ్రమలో ఉపయోగించాలి.

45
గేదె స్కిన్ ఎలా ఉండాలి?
Image Credit : Rangu Kasturi - Farming in Kannada YT Channel

గేదె స్కిన్ ఎలా ఉండాలి?

సాధారణంగా చాలా గేదెల చర్మం దళసరిగా ఉంటుంది... కొన్నింటికి మాత్రమే పల్చగా ఉంటుంది. ఇలా పల్చటి చర్మం కలిగిన బర్రెలు బాగా పాలు ఇస్తాయట. అంతేకాదు పొదుగులోని ప్రతి టీత్ మధ్య సమాన దూరం ఉండాలి... ప్రతిదాని మధ్య మన ఫోర్ ఫింగర్స్ పట్టేంత గ్యాప్ ఉండాలి. ఇలా చర్మం, పొదుగును మంచి మంచి మిల్క్ ఇచ్చే పాడిగేదెను గుర్తించవచ్చు.

కాళ్లను బట్టి కూడా గేదెను అంచనా వేయండి

గేదె కాళ్లకు ఉండే గిట్టలను బట్టి కూడా అది మంచి పాడిగేదె అవునో, కాదో తెలుసుకోవచ్చు. నాలుగు కాళ్ల గిట్టలు సమానంగా ఉండాలి... వాటికి ఎలాంటి పగుళ్లు, వాపు, పుండ్లు వంటివి లేకుండా చూసుకోవాలి. గేదెను కొంచెందూరం నడిపించి సరిగ్గా నడుస్తుందో లేదో చూసుకోవాలి. ఇలా గేదెల కాళ్లు దాని పాల ఉత్పత్తి గురించి చాలా సమాచారం ఇస్తాయి.

55
లేత గేదెను ఎలా గుర్తించాలి?
Image Credit : Rangu Kasturi - Farming in Kannada YT Channel

లేత గేదెను ఎలా గుర్తించాలి?

సాధారణంగా పాడి పరిశ్రమకు లేత వయసున్న గేదెలు అవసరం... అందుకే ఇలాంటి వాటిని సెలక్ట్ చేసుకోవాలి. మరి గేదె వయసును తెలుసుకునేందుకు దాని నోట్లోని పండ్లను పరిశీలించాలి. ఎంత తక్కువ పళ్లు ఉంటే దాని వయసు అంత తక్కువ అన్నమాట. సాధారణంగా రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది పళ్లు ఉంటాయి... కాబట్టి తక్కువ పండ్లు కలిగిన గేదెలను ఎంపిక చేసుకోవాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image2
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image3
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Related Stories
Recommended image1
Murrah Buffalo: ఈ స్పెషల్ గేదె ఒక్కటి చాలు.. ఏడాదికి రూ.లక్షల్లో సంపాదించొచ్చు
Recommended image2
Dairy Farming: ఆవులు, గేదెలు బాగా పాలివ్వాాలంటే రోజూ ఎంత మేత వేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved