Murrah Buffalo: ఊర్లో ఉండి రూ.లక్షలు సంపాదించాలా? ఒక స్పెషల్ గేదెను పెంచి దాని పాలు అమ్మితే మంచి ఆదాయం పొందొచ్చు. ఈ గేదె పాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఆ పాల బిజినెస్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో. 

మీరు ఊర్లో ఉండి డబ్బు సంపాదించడానికి ఏదైనా దారి వెతుకుతుంటే ఈ బిజినెస్ ఐడియా మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ముర్రా జాతికి చెందిన ఒక గేదెను పెంచుతూ దాని పాలు అమ్మితే రూ.లక్షలు సంపాదించవచ్చు. యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో ఈ గేదెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ పాలు ఇచ్చే గేదెల్లో ఒక రకం. ఇవి మిగతా గేదెల కంటే ఎక్కువ పాలు ఇస్తాయి. 

ముర్రా గేదెని గుర్తించడం ఎలా?

ముర్రా గేదె (Murrah Buffalo) నల్లగా, చాలా బలంగా ఉంటుంది. దీని కొమ్ములు చిన్నగా, బాగా వంపు తిరిగి ఉంటాయి. ముర్రా గేదె 500 నుంచి 600 కిలోల వరకు బరువు ఉంటుంది. కానీ ఆడ ముర్రా గేదె 300 నుంచి 400 కిలోల వరకు ఉంటుంది. ముర్రా గేదె ఎండ, వాన, చలి అన్నింటికీ తట్టుకుంటుంది. దీనికి రోగాలు కూడా తక్కువగా వస్తాయి. అందుకే దీన్ని పెంచడం చాలా సులువు.

వీటి పాలల్లో కొవ్వు శాతం ఎక్కువ

కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ముర్రా గేదె పాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇందులో 7 నుంచి 8 % వరకు కొవ్వు ఉంటుంది. అందుకే మీగడ బాగా వస్తుంది. దీనివల్లే ఈ గేదెకు డిమాండ్ ఎక్కువ.

ఎంత పాలు ఇస్తుంది?

పాలు ఇవ్వడంలో ముర్రా గేదె చాలా మంచిదని చెబుతారు. మిగతా గేదెల జాతుల కంటే ఇది ఎక్కువ పాలు ఇస్తుంది. ఇవి రోజుకు 12 నుంచి 18 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఒక్కో గేదె ఏడాదికి 3000 నుంచి 4000 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ముర్రా గేదె పాల క్వాలిటీ చాలా బాగుండటం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే వీటి పాలు ఎక్కువ రేటుకు అమ్ముడవుతాయి. అందువల్ల ఇలాంటి ఒక గేదెను పెంచితే చాలు ఏడాదికి రూ.లక్షల్లో సంపాదించవచ్చు.

ఆదాయం ఎంత వస్తుంది?

మీరు ముర్రా గేదెను పెంచితే మొదట్లో 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ దీని ద్వారా నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. ఈ గేదె రోజుకు 18 లీటర్ల పాలు ఇస్తుంది. ఒక లీటర్ పాల ధర 60 రూపాయలు అనుకుంటే మీరు రోజుకు 1,080 రూపాయలు, నెలకు 32,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అంటే ఒక గెేదె ద్వారా ఏడాదికి 4 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇలా ఆదాయం పెరిగే కొద్దీ మీరు ముర్రా గేదెల సంఖ్యను పెంచి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు.

ఇది కూడా చదవండి మీలో పట్టుదల ఉంటే చాలు రూ.15,000లతో ఈ బిజినెస్ లు స్టార్ట్ చేసి సక్సెస్ కావొచ్చు