MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం

Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం

మనం చెత్త అనుకుని పడేసే వస్తువులే ఇప్పుడు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. పర్యావరణ హితమైన, సహజమైన వస్తువులకు డిమాండ్ పెరుగుతున్న ఈ రోజుల్లో, అరటి వ్యర్థాలతో ఓ కొత్త వ్యాపారం మొదలుపెట్టి మంచి డబ్బు సంపాదించవచ్చు.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 27 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అరటి కాండంతో సూపర్ బిజినెస్
Image Credit : Gemini AI

అరటి కాండంతో సూపర్ బిజినెస్

మనం సాధారణంగా అరటి పండ్లు, కాయలు వాడుకుంటాం. అరటి ఆకులు కుడా ఉపయోగిస్తాం.. కానీ చెట్టు కాండంను మాత్రం పనికిరాదని పడేస్తాం. మీరు ఒకవేళ అరటి సాగు చేస్తుంటే కేవలం పండ్లు, కాయలు, ఆకులు అమ్మడం ద్వారానే కాదు ఈ అరటి కాండం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అరటి నార బిజినెస్
Image Credit : Gemini AI

అరటి నార బిజినెస్

అరటి కాండం నుంచి సహజమైన నారను (ఫైబర్) తయారు చేసి వ్యాపారం చేయవచ్చు. ఈ అరటి నారను టెక్స్‌టైల్స్, హస్తకళా వస్తువులు, కాగితం, ప్యాకేజింగ్, ఇంకా పర్యావరణ హితమైన ఉత్పత్తుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సహజమైన, ఎకో-ఫ్రెండ్లీ వస్తువులకు డిమాండ్ బాగా పెరుగుతోంది కాబట్ట ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి.

34
ఎంత పెట్టుబడి అవసరం?
Image Credit : Freepik

ఎంత పెట్టుబడి అవసరం?

ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో మొదలుపెట్టాలంటే సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. అదే మధ్యస్థాయిలో ప్రారంభించాలనుకుంటే రూ. 8 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు అవసరం అవుతుంది. ఇక పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటే రూ. 25 లక్షలకు పైగా ఖర్చవుతుంది. అయితే మీరు పెట్టే యూనిట్, కొనే యంత్రాలు, ఎంచుకున్న ప్రదేశం, ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి అసలు ఖర్చు ఆధారపడి ఉంటుంది.

ఈ వ్యాపారం కోసం మీరే అరటి తోటలు పెంచాల్సిన అవసరం లేదు. అరటి ఎక్కువగా పండించే ప్రాంతాల్లోని రైతులను సంప్రదించి, వాళ్ల దగ్గరి నుంచి అరటి కాండాలను సేకరించవచ్చు. రైతుల నుంచి నిరంతరం ముడిసరుకు (అరటి కాండం) అందేలా ఒక ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత నార తీసే యంత్రాలు, ప్రాసెసింగ్ పద్ధతులపై శిక్షణ తీసుకోవాలి. కాండం నుంచి నారను వేరు చేసి, శుభ్రపరిచి, ఆరబెట్టి, మంచి నాణ్యతతో తయారు చేయడం ఈ వ్యాపారంలో చాలా ముఖ్యం.

44
అరటి నార బిజినెస్ తో మంచి లాభాలు..
Image Credit : Freepik

అరటి నార బిజినెస్ తో మంచి లాభాలు..

అరటి కాండం నుండి తయారు చేసిన నారను టెక్స్‌టైల్ తయారీదారులు, హస్తకళల వస్తువులు చేసేవారు, పేపర్, ప్యాకేజింగ్ కంపెనీలు, ఎకో-ఫ్రెండ్లీ బ్రాండ్లు, అలాగే ఎగుమతిదారులకు అమ్మవచ్చు. కేవలం నారను అమ్మడమే కాకుండా దానితో తాడు, చాపలు, బ్యాగులు, హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు, ప్రత్యేకమైన కాగితం, పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.

మొదట స్థానిక మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించి, ఆ తర్వాత B2B (బిజినెస్-టు-బిజినెస్) కస్టమర్లను సంపాదించుకోవాలి. డిమాండ్ పెరిగే కొద్దీ ఉత్పత్తిని పెంచుతూ, విదేశీ మార్కెట్లకు కూడా మీ ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చు. వ్యవసాయ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకునే ఈ వ్యాపారంలో మీరు మంచి లాభాలు సంపాదించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
DMart Business Idea : నేరుగా డీమార్ట్‌ తోనే బిజినెస్ చేయండి.. నెలనెలా లక్షల్లో సంపాదించే సూపర్ ఛాన్స్
Recommended image2
Dairy Business Tips : బాగా పాలిచ్చే గేదెలను ఎలా గుర్తించాలి? టాప్ 5 టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved