MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Business
  • DMart Business Idea : నేరుగా డీమార్ట్‌ తోనే బిజినెస్ చేయండి.. నెలనెలా లక్షల్లో సంపాదించే సూపర్ ఛాన్స్

DMart Business Idea : నేరుగా డీమార్ట్‌ తోనే బిజినెస్ చేయండి.. నెలనెలా లక్షల్లో సంపాదించే సూపర్ ఛాన్స్

డీమార్ట్‌లో మీ సొంత ఉత్పత్తులను అమ్మి నెలనెలా లక్షల్లో లాభం పొందాలనుకుంటున్నారా? అయితే డీమార్ట్ సప్లయర్‌గా మారడం ఎలా? కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్లు, అప్లై చేసే విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 24 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీమార్ట్‌లో మీ ఉత్పత్తులను ఎలా అమ్మాలి?
Image Credit : Gemini AI

డీమార్ట్‌లో మీ ఉత్పత్తులను ఎలా అమ్మాలి?

డీమార్ట్… మధ్యతరగతి ప్రజల కిరాణాషాప్. ఇందులో ఇతర షాపుల కన్నా ధరలు తక్కువగా ఉంటాయి… అందుకే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి దగ్గరయ్యింది. డీమార్ట్ అంటే మన వీదిలోని దుకాణంలా మారింది… నెలకు సరిపడా వస్తువులు ఇక్కడే కొంటుంటారు. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు.

నిత్యం కస్టమర్స్ తో రద్దీగా ఉండే డీమార్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్. అందుకే మన ప్రొడక్ట్‌ను కూడా ఇక్కడ అమ్మితే బాగుండని చాలామందికి అనిపిస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే డీమార్ట్ లో వివిధ రకాలు వస్తువులు కొనడమే కాదు మనం ఏవైనా వస్తువులు ఉత్పత్తి చేస్తే అమ్ముకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం.  

డీమార్ట్‌లో అవకాశం

డీమార్ట్‌లో మీరు మీ ఉత్పత్తులను అమ్మవచ్చు… ఇది చాలా ఈజీ ప్రాసెస్. అయితే ముందుగా ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. డీమార్ట్ ఎవరికీ పూర్తిగా ఫ్రాంచైజీలు ఇవ్వదు. అంటే మీ ఊరిలో మీరు డీమార్ట్ స్టోర్ తెరవలేరు. కానీ మీ ఉత్పత్తులను డీమార్ట్‌కు సప్లై చేసే వెండార్ (Vendor) లేదా సప్లయర్‌గా మారవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డీమార్ట్ లో మీ వస్తువులు అమ్మాలంటే ఏ అర్హతలు ఉండాలి?
Image Credit : instagram

డీమార్ట్ లో మీ వస్తువులు అమ్మాలంటే ఏ అర్హతలు ఉండాలి?

మీ ప్రొడక్ట్‌ను డీమార్ట్ కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను చెక్ చేస్తుంది.

క్వాలిటీ

మీ ప్రొడక్ట్ నాణ్యత చాలా బాగుండాలి. అంటే వినియోగదారులు వీటిని తిరస్కరించేలా ఉండకూడదు… ఇలా ఉంటే డీమార్ట్ బ్రాండ్ వ్యాల్యూ దెబ్బతింటుంది. అందుకే నాణ్యత లేని వస్తువులను ఈ స్టోర్ లో అమ్మేందుకు అనుమతించరు. 

ధర

మార్కెట్లో పోటీని తట్టుకునేలా మీ ధర ఉండాలి. అంటే మీరు ఉత్పత్తి చేసిన వస్తువు బయట మార్కెట్ కంటే కాస్త తక్కువ ధర ఉండాలి. డీమార్ట్ బిజినెస్ సీక్రెట్ కూడా ఇదే… తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందించాలి. 

ప్యాకింగ్

డీమార్ట్ ను మీరు ఓసారి గమనించండి… ఇక్కడ వస్తువులన్నీ చాలా నీట్ ప్యాకింగ్ తో ఉంటాయి. అంటే ఇందులో వస్తువులు అమ్మాలంటే మీ ఉత్పుత్తులను కూడా చూడటానికి ఆకర్షణీయంగా ఉండేలా ప్యాక్ చేయాలి. 

నిరంతర సరఫరా

డీమార్ట్ అనేది చాలా పెద్దఎత్తున బిజినెస్ చేస్తుంది… వాళ్ల కస్టమర్లు చాలా ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి మీ వస్తువులు ఇక్కడ అమ్మాలంటే నిరంతర సరఫరా ఉండాలి.. వాళ్లు అడిగినప్పుడల్లా కొరత లేకుండా సరుకును సప్లై చేసే సామర్థ్యం మీకు ఉండాలి. అప్పుడే మీ ప్రోడక్ట్స్ ను ఇందులో అమ్ముకోడానికి అవకాశం కల్పిస్తారు.

 

Related Articles

Related image1
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
Related image2
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
35
డీమార్ట్ తో కలిసి బిజినెస్ చేయాలంటే ఏమేం డాక్యుమెంట్లు కావాలి?
Image Credit : Dmart

డీమార్ట్ తో కలిసి బిజినెస్ చేయాలంటే ఏమేం డాక్యుమెంట్లు కావాలి?

డీమార్ట్ లో మీ వస్తువులు అమ్మాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. ముఖ్యంగా మీ బిజినెస్ కు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అంటే మీ ఉత్పత్తులకు సంబంధించిన GST, PAN నంబర్లు తప్పనిసరిగా కావాలి. మీది ఆహార ఉత్పత్తి అయితే FSSAI లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. కొన్ని వస్తువులకు BIS వంటి ప్రభుత్వ సర్టిఫికెట్లు కూడా అవసరం కావచ్చు. ఇలా మీ ఉత్పత్తిని బట్టి నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. అన్నీ సరిగ్గా ఉంటేనే మీ వస్తువులను డీమార్ట్ లో అమ్ముకోడానికి అనుమతి ఇస్తారు.

45
డీమార్ట్ తో బిజినెస్ చేయాలంటే ఎంత డబ్బు అవసరం?
Image Credit : Dmart India

డీమార్ట్ తో బిజినెస్ చేయాలంటే ఎంత డబ్బు అవసరం?

సప్లయర్‌గా మారడానికి ప్రత్యేకంగా ఫ్రాంచైజీ ఫీజు ఏమీ ఉండదు. కానీ వస్తువును తయారు చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి, స్టాక్ మెయింటెయిన్ చేయడానికి, రవాణా, సరైన టైమ్‌కి డెలివరీ చేయడానికి.. ఇలా అన్నింటికీ చూసుకుంటే మీ చేతిలో కొంత పెట్టుబడి ఉండాలి. కొన్నిసార్లు, స్టోర్ షెల్ఫ్‌లో మీ వస్తువును పెట్టడానికి కూడా ప్రత్యేకంగా ఛార్జీలు ఉండొచ్చు.

నెలకి ఎంత లాభం వస్తుంది?

డీమార్ట్‌లో మీ ప్రొడక్ట్ అమ్మడం ద్వారా ఎంత లాభం వస్తుందో కచ్చితంగా చెప్పలేం. అది మీ వస్తువు నాణ్యత, దానికి ఉన్న డిమాండ్, అమ్మకాల పరిమాణం, మీ ఖర్చులు, డీమార్ట్ కంపెనీతో మీరు చేసుకునే ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది.

55
డీమార్ట్ సప్లయర్‌గా మారడానికి ఎలా అప్లై చేయాలి?
Image Credit : Dmart

డీమార్ట్ సప్లయర్‌గా మారడానికి ఎలా అప్లై చేయాలి?

అప్లికేషన్ ప్రాసెస్ : డీమార్ట్ అధికారిక వెబ్‌సైట్ (Avenue Supermarts Ltd - Partner With Us) లోకి వెళ్లి 'Vendor Registration' ఫామ్ నింపి అప్లై చేయాలి. నేరుగా ఆఫీస్‌కు వెళ్లడం కన్నా ఇదే సరైన పద్ధతి.

MSME / Udyam రిజిస్ట్రేషన్ : మీరు చిన్న లేదా మధ్య తరహా పరిశ్రమ అయితే, కేంద్ర ప్రభుత్వ Udyam / MSME సర్టిఫికెట్ ఉంటే ప్రాధాన్యం లభించడంతో పాటు, వ్యాపారానికి రక్షణ ఉంటుంది.

పేమెంట్ సైకిల్ : డీమార్ట్ సాధారణంగా సరుకు తీసుకున్న 30 నుంచి 60 రోజుల్లోపు పేమెంట్ చేస్తుంది. ఈ గ్యాప్‌ను తట్టుకునేలా మీ దగ్గర డబ్బు ఉండాలి.

రిటర్న్ పాలసీ : అమ్ముడుపోని లేదా పాడైన వస్తువులను వెనక్కి తీసుకునే (RTV - Return to Vendor) నిబంధనలకు మీరు ఒప్పుకోవాలి.

బార్‌కోడ్ (Barcode) : మీ ప్రతి ఉత్పత్తిపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన GS1 బార్‌కోడ్ తప్పనిసరిగా ప్రింట్ చేసి ఉండాలి.

మీ ప్రొడక్ట్ క్వాలిటీ చాలా బాగుండి, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉండి, అడిగినప్పుడు సప్లై చేసే కెపాసిటీ ఉంటే, డీమార్ట్ లాంటి పెద్ద రిటైల్ చైన్‌లో మీ వస్తువుకు కచ్చితంగా చోటు దొరుకుతుంది. కాబట్టి ముందు మీ బ్రాండ్‌ను సరిగ్గా నిలబెట్టడంపై దృష్టి పెట్టండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge plan: రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
Related Stories
Recommended image1
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
Recommended image2
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved