MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?

Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?

Credit Card: దేశంలో క్రెడిట్ కార్డు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ర‌క‌ర‌కాల అవ‌స‌రాల కోసం ప్రజలు క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా విడుద‌ల చేసిన గ‌ణంకాల్లో కీల‌క విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 27 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరుసగా మూడో నెల రూ.2 లక్షల కోట్లకు పైనే
Image Credit : Asianet News

వరుసగా మూడో నెల రూ.2 లక్షల కోట్లకు పైనే

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం.. జూలై 2026లో దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.2.08 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. ఇది జూన్‌లో నమోదైన రూ.2.01 లక్షల కోట్లతో పోలిస్తే ఎక్కువ. 2025 జూలైలో నమోదైన రూ.1.93 లక్షల కోట్లతో పోల్చినా ఈసారి ఖర్చు గణనీయంగా పెరిగింది. క్రెడిట్ కార్డు ఖర్చులు పెరుగుతున్న తీరును చూస్తే వినియోగదారులు ఈ కార్డులపై ఎంతగా ఆధారపడుతున్నారో అర్థమవుతుంది. జూలై 2026లో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2.08 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. అంతకుముందు జూన్‌లో రూ.2.01 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యంగా వరుసగా మూడో నెలలో క్రెడిట్ కార్డు ఖర్చు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలకు సగటున రూ.1.93 లక్షల కోట్ల మేర క్రెడిట్ కార్డు ఖర్చు జరిగింది. 2026 జనవరి నుంచి జూలై వరకు ఈ సగటు దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య కూడా భారీగా పెరిగింది
Image Credit : Getty

దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య కూడా భారీగా పెరిగింది

ఖర్చు పెరగడంతో పాటు క్రెడిట్ కార్డుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. 2026 జూలై నాటికి దేశంలో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య సుమారు రూ. 12.29 కోట్లకి చేరింది. 2026 జూన్‌లో ఈ సంఖ్య సుమారు 12.16 కోట్లుగా ఉంది. అంటే ఒక్క నెలలోనే కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025 జూలైలో దేశవ్యాప్తంగా సుమారు 11.16 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అంటే ఏడాది వ్యవధిలో క్రెడిట్ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. కార్డుల సంఖ్య పెరగడం, వాటి వినియోగం ఎక్కువ కావడం వల్ల మొత్తం క్రెడిట్ కార్డు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.

35
ఏ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఎక్కువ ఖర్చు చేశారు?
Image Credit : Getty

ఏ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఎక్కువ ఖర్చు చేశారు?

RBI గణాంకాలను పరిశీలిస్తే ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా భారీ మొత్తంలో ఖర్చు జరిగినట్లు తెలుస్తోంది.

* జూలై 2026లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల ద్వారా సుమారు రూ.60,217.54 కోట్లు ఖర్చు చేశారు. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఖర్చు 11.93 శాతం పెరిగింది.

* SBI క్రెడిట్ కార్డుల ద్వారా జూలైలో సుమారు రూ.39,591.76 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ ఖర్చు ఏకంగా 21.6 శాతం పెరిగింది.

* ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా సుమారు రూ. 34,025.27 కోట్లుగా ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ బ్యాంకు కార్డు ఖర్చుల్లో 5.9 శాతం తగ్గుదల నమోదైంది.

* యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా జూలైలో సుమారు రూ.23,824.7 కోట్లు ఖ‌ర్చు చేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4.6 శాతం వృద్ధి నమోదైంది.

ఇక జూలై వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన మొత్తం ఖర్చు సుమారు రూ.46,000 కోట్లుగా ఉంది.

45
రానున్న రోజుల్లో ఖర్చులు మరింత పెరిగే అవకాశం
Image Credit : Getty

రానున్న రోజుల్లో ఖర్చులు మరింత పెరిగే అవకాశం

దేశంలో ప్రతి నెలా రూ.2 లక్షల కోట్లకు పైగా క్రెడిట్ కార్డుల‌పై ఖర్చు చేయడం సాధారణ ట్రెండ్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో పండుగల సీజన్ ప్రారంభం కానుండటంతో క్రెడిట్ కార్డు వినియోగం మరింత పెరగవచ్చు. షాపింగ్, ప్రయాణాలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, ఇతర అవసరాల కోసం ప్రజలు క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో రాబోయే నెలల్లో క్రెడిట్ కార్డు ద్వారా జరిగే మొత్తం ఖర్చు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

55
గ‌మ‌నిక‌:
Image Credit : Asianet News

గ‌మ‌నిక‌:

అయితే క్రెడిట్ కార్డును ఉపయోగించే సమయంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. గడువు తేదీలోగా బిల్లు చెల్లించకపోతే వడ్డీ, ఇతర ఛార్జీల భారం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డును సౌకర్యవంతమైన చెల్లింపు సాధనంగా ఉపయోగించాలి కానీ అవసరానికి మించి అప్పుగా మార్చుకోకపోవడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సామాన్యుడిపై మ‌రో దెబ్బ‌.. ఈ సారి మొబైల్ రీచార్జ్‌ల వంతు, ఎంత పెర‌గ‌నున్నాయంటే
Recommended image2
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image3
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Related Stories
Recommended image1
నెమ్మ‌దిగా వెళ్తేనే త్వ‌ర‌గా గ‌మ్యాన్ని చేరుకుంటాం.. మీ ఆలోచ‌న‌ను మార్చేసే క‌థ
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved