MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Andhra Pradesh
  • AP Mega DSC 2026: మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. నిజంగానే పెద్ద స్కామా?

AP Mega DSC 2026: మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. నిజంగానే పెద్ద స్కామా?

AP Mega DSC 2026: ఏపీ డీఎస్సీ భర్తీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 10 2026, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు పట్టుబట్టిన మాజీ సీఎం జగన్
Image Credit : YSRCP Twitter

డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు పట్టుబట్టిన మాజీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల భర్తీ ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. తాజా పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని ఆయన విమర్శించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నలు
Image Credit : Chandrababu Twitter

స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నలు

స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన 372 పోస్టుల భర్తీ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఎలాంటి పోటీలు నిర్వహించకుండానే కొన్ని క్రీడా విభాగాల్లో విజేతలైనట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. జూడో పోటీలు జరగలేదని సంబంధిత అసోసియేషన్ ప్రతినిధులే చెబుతున్నప్పటికీ, ఆ విభాగంలో అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఎలా లభించాయని నిలదీశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు.

Related Articles

Related image1
Udaya Bhanu: నా కలకు ప్రాణం పోసిన వ్యక్తి.. స్టేజీపైనే ఏడ్చేసిన ఉదయభాను.. ఎవరు వాళ్లు?
Related image2
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
35
జీవోల మార్పు, నిబంధనల విధింపు
Image Credit : Asianet News

జీవోల మార్పు, నిబంధనల విధింపు

గతంలో ఉన్న క్రీడల కోటాను సవరించేందుకు జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారని, నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత మళ్లీ జీవో నంబర్ 23, 25, 56 ద్వారా నిబంధనలను మార్చారని జగన్ అన్నారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయకుండా, నకిలీ పత్రాలు ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.

45
మెరిట్ లిస్ట్, అభ్యర్థుల లాగిన్ వివాదం
Image Credit : YS Jagan Twitter

మెరిట్ లిస్ట్, అభ్యర్థుల లాగిన్ వివాదం

పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలను ఒకే వ్యవస్థ లేదా వ్యక్తికి అప్పగించడం వల్ల పారదర్శకత లోపించిందని వైఎస్ జగన్ అన్నారు. ఎస్సీఈఆర్టీ విభాగంలో పనిచేసిన ఓ అభ్యర్థికి మొదటి ర్యాంక్ రావడం, ఆ తర్వాత మెరిట్ జాబితా నుంచి అతని పేరు మాయమవ్వడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సదరు అభ్యర్థి లాగిన్ బ్లాక్ చేయడం వల్ల అతను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని జగన్ గుర్తుచేశారు.

55
దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు డిమాండ్
Image Credit : YSRCP Twitter

దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు డిమాండ్

క్రీడా సంఘాల అధ్యక్షులుగా ఉన్న ముఖ్య నేతల పేర్లను ప్రస్తావిస్తూ, తెలంగాణలోని ఖమ్మం వంటి ప్రాంతాల్లో జరగని పోటీల పేరిట రికార్డులు సృష్టించారని జగన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ విచారణను వేగవంతం చేయడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇతర ఉద్యోగాల భర్తీపై ప్రభావం

డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టిన నియామకాలపై కూడా ఈ వివాదాల ప్రభావం పడిందని జగన్ పేర్కొన్నారు. వ్యవస్థలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు నమ్మకం పోయేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
Recommended image2
Now Playing
గన్నవరం ప్రజలకు బిగ్ రిలీఫ్ స్పాట్ లోనే పట్టాలు | Chandrababu Key Decision on 22A Lands
Recommended image3
Tirumala: తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్‌
Related Stories
Recommended image1
Udaya Bhanu: నా కలకు ప్రాణం పోసిన వ్యక్తి.. స్టేజీపైనే ఏడ్చేసిన ఉదయభాను.. ఎవరు వాళ్లు?
Recommended image2
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved