MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవ పథకం నిధుల జమపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇ-కేవైసీ పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2026, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ 24వ విడత పై బిగ్ అప్‌డేట్.. అకౌంట్లలో ఆ రోజే రూ.6 వేలు జమ?
Image Credit : Asianet News

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ 24వ విడత పై బిగ్ అప్‌డేట్.. అకౌంట్లలో ఆ రోజే రూ.6 వేలు జమ?

అన్నదాతలకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఒకవైపు వర్షాలు, ఎల్ నినో కష్టాలు, మరోవైపు పండుగల సీజన్ స్టార్ట్ కావడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులతో పాటు ఏపీ ప్రభుత్వం అందించే 'అన్నదాత సుఖీభవ' సొమ్మును ఒకేసారి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అక్టోబర్ తొలి వారంలోనే ఖాతాల్లోకి డబ్బులు?
Image Credit : Asianet News

అక్టోబర్ తొలి వారంలోనే ఖాతాల్లోకి డబ్బులు?

పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేస్తారు. గతేడాది జూన్ నెలలో 23వ విడత నిధులు అందాయి. అయితే 24వ విడత నిధులను మొదట వినాయక చవితి పండుగ కానుకగా ఈ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

35
ఏపీ రైతులకు ఒకేసారి రూ.6,000 లబ్ధి
Image Credit : Asianet News

ఏపీ రైతులకు ఒకేసారి రూ.6,000 లబ్ధి

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ఇది రెట్టింపు సంతోషాన్నిచ్చే వార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రూ.6,000 కి అదనంగా ఏపీ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా మరో రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 వార్షిక సాయంగా అందిస్తోంది. కేంద్రం 24వ విడత కింద రూ.2,000 విడుదల చేసే సమయంలోనే, ఏపీ ప్రభుత్వం కూడా తన వంతు వాటాను కలిపి రూ.6,000 ఒకే విడతగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనివల్ల పండుగల వేళ ఏపీ రైతులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలగనుంది.

45
ఈ తప్పులు చేస్తే ఖాతాలో డబ్బులు పడవు
Image Credit : Asianet News

ఈ తప్పులు చేస్తే ఖాతాలో డబ్బులు పడవు

పథకంలో పేరు నమోదైనంత మాత్రాన డబ్బులు పడతాయని అనుకుంటే పొరపాటే. నిధులు అకౌంట్‌లో జమకావాలంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి.

• e-KYC పూర్తవ్వాలి: మీ ఆధార్ సీడింగ్, ఇ-కేవైసీ కంప్లీట్ కాకపోతే తదుపరి విడత డబ్బులు నిలిచిపోతాయి.

• భూమి వివరాల ధృవీకరణ : మీ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వివరాలు పోర్టల్‌లో సరిగ్గా వెరిఫై అయి ఉండాలి.

• బ్యాంకు ఖాతా సమాచారం: బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి, ఆక్టివ్‌గా ఉండాలి.

• అనర్హుల నిబంధనలు: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్ కమ్ టాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు.

55
మీ ఇన్ స్టాల్ మెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా
Image Credit : iSTOCK

మీ ఇన్ స్టాల్ మెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా

మీ అకౌంట్‌కి డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ.

• ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) ఓపెన్ చేయండి.

• 'Farmers Corner' సెక్షన్‌కి వెళ్లి 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

• మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయగానే ఒక OTP వస్తుంది.

• OTP ఎంటర్ చేస్తే మీ e-KYC, ల్యాండ్ సీడింగ్, పేమెంట్ స్టేటస్ క్లియర్‌గా కనిపిస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
అమరావతి
ప్రభుత్వ పథకాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
Recommended image2
Now Playing
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
Recommended image3
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?
Related Stories
Recommended image1
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image2
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved