MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?

Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?

సినిమాల్లో పవర్ స్టార్… రాజకీయాల్లో జనసేనాని… పాలనలో డిప్యూటీ సీఎం… ఇవన్నీ ఒక్కరే, ఆయనే పవన్ కల్యాణ్. ఆసక్తికర విషయం ఏంటంటే ఈయన అసలు పేరు పవన్ కల్యాణ్ కాదట… ఏంటో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 02 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పవన్ కల్యాణ్ పేరు వెనక ఆసక్తికర స్టోరీ
Image Credit : X/Janasena Party

పవన్ కల్యాణ్ పేరు వెనక ఆసక్తికర స్టోరీ

Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. సినీ అభిమానులకు 'పవర్ స్టార్' గా... రాజకీయ అభిమానులకు 'జనసేనాని' గా.. ఆడబిడ్డలకు 'పవనన్న' గా... మరికొందరికి 'కల్యాణ్ బాబు'గా సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులకు కలిగిన హీరో పవన్ కల్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. పొలిటికల్ గా కూడా ఆయన ఎంత స్ట్రాంగో గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితమే తెలియజేసింది.

మొత్తంగా పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి... అభిమానం కట్టలుతెంచుకుంటుంది. చాలామంది తమ పిల్లలకు పవన్ కల్యాణ్ అని పేరు పెట్టుకుంటున్నారంటేనే ఈ పేరులో మ్యాజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే నిజానికి పవన్ కల్యాణ్ అసలుపేరు ఇది కాదట.. తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అసలు పేరు ఏంటి? పవన్ కల్యాణ్ గా ఎలా మారారు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పవన్ కల్యాణ్ అసలు పేరేంటి?
Image Credit : X/jnasenaparty

పవన్ కల్యాణ్ అసలు పేరేంటి?

సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో పవన్ కల్యాణ్ జన్మించారు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి... వీరికి చివరి సంతానంగా పుట్టారు. తమ బిడ్డకు ఈ దంపతులు కల్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు.

తండ్రి వెంకటరావు ఎక్సైజ్ పోలీస్ కావడంతో కొణిదెల ఫ్యామిలీ అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఇలా బాపట్లలో పుట్టిన కల్యాణ్ కుమార్ నెల్లూరులో విద్యాబ్యాసం చేశారు. తర్వాత అన్న చిరంజీవితో కలిసి చెన్నైలో ఉన్నారు... ఇక్కడే ఉన్నత విద్యాబ్యాసం చేశారు. సినిమా ఇండస్ట్రి చెన్నై నుండి హైదరాబాద్ కు మారినతర్వాత అన్నతోపాటే పవన్ కూడా హైదరాబాద్ కు మకాం మార్చారు.

34
కల్యాణ్ కుమార్ పేరు పవన్ కల్యాణ్ గా ఎలా మారింది?
Image Credit : X/Janasena Party

కల్యాణ్ కుమార్ పేరు పవన్ కల్యాణ్ గా ఎలా మారింది?

చిన్నతనంనుండే తండ్రి వెంకటరావు, అన్న చిరంజీవిని చూస్తూ పెరిగిన కల్యాణ్ కుమార్ కు ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద ఉండేది. అంతేకాదు స్వీయ రక్షణ కూడా మనిషికి ముఖ్యమని భావించిన ఈయన మార్షల్ ఆర్ట్స్ (కరాటే) నేర్చుకున్నారు. ఇందులో అతడి ప్రతిభను గుర్తించిన ఓ గురువు 'పవన్' అని పేరుపెట్టారు. అంటే పంచభూతాల్లో ఒ కటైన గాలిలా ఇతడు చురుగ్గా, శక్తిమంతంగా ఉండటంతో పవన్ అని ముద్దుగా పిలిచేవారు.

అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ పవన్ కల్యాణ్ అనే పేరును ప్రచారం కోసం వాడారు. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ద్వారా కల్యాణ్ కుమార్ పరిచయం అయ్యారు... ఇందులోనే మొదటిసారి పవన్ కల్యాణ్ పేరును వాడారు. తర్వాత ఈ పేరే స్థిరపడిపోయింది.

44
సినీ హీరో నుండి డిప్యూటీ సీఎం వరకు... పవన్ కల్యాణ్ ప్రయాణం
Image Credit : X/Janasena Party

సినీ హీరో నుండి డిప్యూటీ సీఎం వరకు... పవన్ కల్యాణ్ ప్రయాణం

పవన్ కల్యాణ్ సినీ జీవితం అంత సక్సెస్ ఫుల్ గా ఏం సాగలేదు. ఆరంభంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ అద్భుత విజయాలు సాధించాయి. కానీ తర్వాత జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం వంటి సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి... ఇలా దశాబ్దానికి పైగా అపజయాలు ఎదురైనా పవన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే పవన్ ను జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సినిమాలు సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి... వీటి తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు.

అన్న చిరంజీవి ప్రజారాజ్యం పేరిట రాజకీయ పార్టీ పెట్టడంతో అందులో పవన్ కీలకంగా వ్యవహరించారు. అయితే చిరంజీవి రాజకీయాలను వీడినా పవన్ మాత్రం వీడలేదు.. సొంతంగా జనసేన పార్టీ పెట్టి ముందుకు సాగారు. రాజకీయాల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గలేదు... పదేళ్ళపాటు ఓపికగా ప్రజా సమస్యలపై పోరాడారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది... పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటీ సీఎం అయ్యారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పవన్ కళ్యాణ్
జనసేన
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు | Chief Ministers Chandrababu Vijay Joseph meeting at Vijayawada | Asianet
Recommended image2
ఏపీ సీఎం చంద్ర‌బాబుతో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ భేటీ.. ఏం చ‌ర్చించారంటే.?
Recommended image3
Now Playing
దళపతి విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన విజయవాడ ఉత్సవ్ | CM Vijay Powerful Speech at Vijayawada Utsav 2.0
Related Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved