MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Andhra Pradesh
  • మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్ర‌మాలు పూర్తిగా అవాస్త‌వం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్ర‌మాలు పూర్తిగా అవాస్త‌వం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

Mega DSC: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 08 2026, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెట్ అర్హతపై స్పష్టత
Image Credit : I & PR Andhra Pradesh/FB

టెట్ అర్హతపై స్పష్టత

1–8 తరగతులకు ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌ ముఖ్యమైన అర్హతగా ఉందని అధికారులు తెలిపారు. OC/EWS అభ్యర్థులకు 60 శాతం, BCలకు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ/ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు 40 శాతం కనీస ఉత్తీర్ణత మార్కులు ఉన్నాయని వివరించారు. అయితే ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌, స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌), ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్‌, పీజీటీ, ప్రిన్సిప‌ల్ పోస్టులకు ప్రత్యేక TET అర్హత అవసరం లేదన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులపై వివరణ
Image Credit : I & PR Andhra Pradesh/X

ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులపై వివరణ

కర్నూలుకు చెందిన ఎడిగా ప్రభాకర్ 2018లో టెట్ పేప‌ర్‌-II-Bలో 77 మార్కులు సాధించినట్లు రికార్డుల్లో ఉందని అధికారులు తెలిపారు. ఈ అంశంపై విచారణ కొనసాగుతోందన్నారు. జంపాల ఉష 2012లో 79, 80 మార్కులు, 2017లో 76 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే మిరియాల గాయత్రి సాయి శ్రీ APTET–2024లో 97.89 మార్కులు, ప్రగడ కళ్యాణి APTET–2018లో 75 మార్కులు సాధించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయని తెలిపారు.

Related Articles

Related image1
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Related image2
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
35
ఇతర అభ్యర్థుల టెట్ అర్హతలు
Image Credit : I & PR Andhra Pradesh/X

ఇతర అభ్యర్థుల టెట్ అర్హతలు

షేక్ నయాబ్ రసూల్, జక్కుల ఉదయలక్ష్మి, తాడిమర్రి మహమ్మద్ రఫీ, దేవరకొండ పవన్ కుమార్, తొగట చరణ్ రాజా తదితరులు తమకు వర్తించే TETలో అవసరమైన మార్కులు సాధించినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరుకు చెందిన వి. చక్రపాణి రెడ్డి ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్ కేటగిరీలో 60 మార్కులు అవసరం కాగా, APTET–2024లో 79.47 మార్కులు సాధించారని వివరించారు.

45
జూడో, ఇతర స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై విచారణ
Image Credit : I & PR Andhra Pradesh/X

జూడో, ఇతర స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై విచారణ

స్పోర్ట్స్ కోటా జాబితాను 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు ప్రచురించి, అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం కల్పించినట్లు SAAP అధికారులు తెలిపారు. జూడో సర్టిఫికెట్ల ప్రామాణికతపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు. ఒకే మండలానికి చెందిన 21 మంది అభ్యర్థులు, వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారనే ఆరోపణలపై కూడా విచారణ పూర్తయ్యాకే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

55
ఇతర స్పోర్ట్స్ సర్టిఫికెట్లపైనా అధికారుల వివరణ
Image Credit : I & PR Andhra Pradesh/X

ఇతర స్పోర్ట్స్ సర్టిఫికెట్లపైనా అధికారుల వివరణ

భర్త, భార్య ఇద్దరూ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అంశంలో వారు వేర్వేరు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీ చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద అప్పలరాజు విషయంలో మొదట తప్పుగా సోదరుడి సర్టిఫికెట్ అప్‌లోడ్ చేసినా, తర్వాత తన నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌షిప్ సర్టిఫికెట్‌ను సమర్పించినట్లు వివరించారు. కొనడ పద్మజకు సంబంధించిన అథ్లెటిక్స్‌ సర్టిఫికెట్‌ను అధికారిక రికార్డులు, సంబంధిత అసోసియేషన్ ధ్రువీకరణ ఆధారంగా చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించినట్లు తెలిపారు. సాఫ్ట్‌బాల్‌ సర్టిఫికెట్లను కూడా సంబంధిత సంస్థల ధ్రువీకరణ ఆధారంగానే పరిశీలించినట్లు చెప్పారు. EWS కేటగిరీలో నియామకాలు సమర్థ అధికారి జారీ చేసిన అధికారిక సర్టిఫికెట్ల ఆధారంగా జరిగాయని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏదైనా సర్టిఫికెట్ నకిలీదని లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉందని విచారణలో తేలితే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dasara Holidays : ఈసారి దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు, ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
Now Playing
ఆ పాపమే నిన్నే వెంటాడుతుంది జగన్ | Chinthamaneni Prabhakar Fires On Ys Jagan | Asianet Telugu
Recommended image3
Now Playing
ప్రలోభాలకు లోనై జీవితాలు నాశనం చేసుకోవద్దు | HM Anitha Strong Warning To Constable Candidates
Related Stories
Recommended image1
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Recommended image2
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved