MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Weather Update: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 17 2026, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాలకు వార్నింగ్
Image Credit : Gemini

మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాలకు వార్నింగ్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. శనివారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి, క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు వర్ష ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురుస్తాయి.

35
తెలంగాణలో 23 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు
Image Credit : Chatgpt

తెలంగాణలో 23 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 48 గంటలు వర్షాల పరంగా అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 23 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

45
రాత్రి వేళల్లో భీకర మార్పులు.. హైదరాబాద్ వాసులు జాగ్రత్త
Image Credit : Gemini

రాత్రి వేళల్లో భీకర మార్పులు.. హైదరాబాద్ వాసులు జాగ్రత్త

పగటిపూట విపరీతమైన ఎండ, తేమతో కూడిన ఉక్కపోత ఉన్నప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి దాటిన తర్వాత వాతావరణంలో వేగంగా మార్పులు రానున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరంలోనూ రాత్రి వేళల్లో ఆకస్మిక ఈదురుగాలులు, బలమైన మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అవసరమైతే తప్ప రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని అధికారులు కోరుతున్నారు.

55
మత్స్యకారులకు అలర్ట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Gemini

మత్స్యకారులకు అలర్ట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు సురక్షిత తీరాలకు చేరుకోవాలని సూచించారు.

ఈదురుగాలులు, మెరుపులు: వాన పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభాలు, చెట్లు, పాత భవనాలు, ఐరన్ హోర్డింగ్‌ల కింద నిల్చోవద్దు.

లోతట్టు ప్రాంతాలు: వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు | Chief Ministers Chandrababu Vijay Joseph meeting at Vijayawada | Asianet
Recommended image2
ఏపీ సీఎం చంద్ర‌బాబుతో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ భేటీ.. ఏం చ‌ర్చించారంటే.?
Recommended image3
Now Playing
దళపతి విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన విజయవాడ ఉత్సవ్ | CM Vijay Powerful Speech at Vijayawada Utsav 2.0
Related Stories
Recommended image1
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved