MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్

Andhra pradesh: ఒకప్పుడు కరవు, వలసలతో వార్తల్లో నిలిచిన రాయలసీమ ఇప్పుడు బంగారం ఉత్పత్తి కేంద్రంగా కొత్త గుర్తింపు పొందబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో భారీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 23 2026, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జొన్నగిరి.. కొత్త బంగారు గని కేంద్రం
Image Credit : Asianet News

జొన్నగిరి.. కొత్త బంగారు గని కేంద్రం

ఇప్పటివరకు దేశంలో బంగారు గనులు అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) పేరు ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి కూడా చేరబోతోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన తర్వాత, ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని కేటాయించింది. మొత్తం 1,500 ఎకరాల విస్తీర్ణంలో గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టనుండగా, తొలి దశలో సుమారు 600 ఎకరాల్లో తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న అతిపెద్ద బంగారం వెలికితీత ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.405 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్
Image Credit : Asianet News

రూ.405 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్

జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. ఇందుకోసం సుమారు రూ.405 కోట్ల పెట్టుబడిని పెట్టాయి. బంగారు ఖనిజాన్ని వెలికితీసి శుద్ధి చేయడానికి ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. గనుల నుంచి తీసిన ఖనిజాన్ని శుద్ధి చేసి స్వచ్ఛమైన బంగారంగా మార్చే ప్రక్రియ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన నీటి సరఫరా కోసం హంద్రీ-నీవా సుజల స్రవంతి నుంచి సుమారు 18 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నీటిని తరలించే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Related Articles

Related image1
పెట్రోల్ ధ‌ర‌లు ఎంతైనా పెర‌గ‌ని.. 176 కి.మీల మైలేజ్ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ధ‌ర ల‌క్ష‌లోపే
Related image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
35
దశలవారీగా పెరగనున్న బంగారం ఉత్పత్తి
Image Credit : AI Meta

దశలవారీగా పెరగనున్న బంగారం ఉత్పత్తి

జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తిని దశల వారీగా పెంచేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి ఏడాదిలో సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండో దశలో ఉత్పత్తిని 900 కిలోల వరకు పెంచనున్నారు. భవిష్యత్తులో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మరింత విస్తరించి, ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేసే స్థాయికి ఈ ప్రాజెక్టును తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో జొన్నగిరి దేశంలోని ప్రధాన బంగారం ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

45
రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం.. స్థానికులకు ఉపాధి
Image Credit : AI Generated Photos

రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం.. స్థానికులకు ఉపాధి

ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా గణనీయమైన ఆదాయం సమకూరనుంది. గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం విలువలో 4 శాతం రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. ప్రారంభ దశలో 400 కిలోల బంగారం ఉత్పత్తి ద్వారా సుమారు రూ.57 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉత్పత్తి 900 కిలోలకు పెరిగినప్పుడు ఈ రాయల్టీ ఆదాయం రూ.144 కోట్ల వరకు చేరే అవకాశముంది. అదే సమయంలో ప్రాజెక్ట్ ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరోక్షంగా రవాణా, సేవలు, ఇతర అనుబంధ రంగాల్లో మరెందరికో ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

55
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
Image Credit : Threads

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బుధవారం జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్లాంట్ తొలి యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం, విస్తరణలో భాగంగా ఏర్పాటు చేయనున్న రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రాజెక్ట్ ప్రాముఖ్యతపై  ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా గనుల్లో ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వాణిజ్య స్థాయిలో బంగారం ఉత్పత్తికి మార్గం సుగమమైంది.

రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశ

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు కీలక మలుపుగా మారే అవకాశముంది. పరిశ్రమలు, ఉపాధి, ప్రభుత్వ ఆదాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఈ ప్రాజెక్ట్ ప్రభావం చూపనుంది. ఒకప్పుడు కరవు ప్రాంతంగా పేరుగాంచిన రాయలసీమ, ఇప్పుడు బంగారం ఉత్పత్తి కేంద్రంగా దేశ దృష్టిని ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో జొన్నగిరి పేరు రాబోయే రోజుల్లో భారత గోల్డ్ మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Recommended image2
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
Recommended image3
Now Playing
మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
Related Stories
Recommended image1
పెట్రోల్ ధ‌ర‌లు ఎంతైనా పెర‌గ‌ని.. 176 కి.మీల మైలేజ్ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ధ‌ర ల‌క్ష‌లోపే
Recommended image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved