సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజని పోలీస్ ఆఫీసర్ గానటించబోతున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్. సర్కార్ చిత్రం తర్వాత మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ నుంచి లీకైన రజని లుక్ అభిమానులని కుదురుగా ఉండనీయడం లేదు. 

ఇలాంటి సందర్భంలో సందర్భంలో సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేలా ఓ వార్త బయటకు వచ్చింది. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఈ చిత్రంలో నటించబోతున్నారట. యోగ్ రాజ్ సింగ్ క్రికెటర్ గా తన కెరీర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత నటుడిగా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

రజనీకాంత్ దర్భార్ చిత్రంలో ఓ ఫైట్ సన్నివేశంలో యోగ్ రాజ్ సింగ్ కనిపిస్తారని సమాచారం. అంటే ఆయన ఈ చిత్రంలో విలన్ కు చెందిన మనిషిగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇలా అనేక ప్రత్యేకతలతో దర్బార్ మూవీ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.