Asianet News TeluguAsianet News Telugu

మెగా అల్లుడి హడావిడి, అసలు కారణం

ప్రభుత్వం షూటింగ్ లకు ఫర్మిషన్  ఇచ్చినప్పటికీ దాదాపు పెద్ద హీరోలంతా షూటింగ్స్ కు దూరమయ్యారు. మెగాస్టార్  చిరంజీవి కూడా ఆచార్య షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. అయితే చిరంజీవి అల్లుడు మాత్రం డేర్ చేశాడు. కల్యాణ్ దేవ్ సెట్స్ పైకి వచ్చి సూపర్ మచ్చి షూటింగ్ స్టార్ట్ చేయటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ మెగా అల్లుడుని మామ చిరు ఆపలేదా అంటూ సోషల్ మీడియాలో చర్చలు. ఈ నేపధ్యంలో మెగా అల్లుడు ఇంత ధైర్యం చేయటానికి కారణమేంటి అనే విషయం కూపి లాగటం మొదలెట్టారు.

Why  Super Machi shooting started
Author
Hyderabad, First Published Jun 24, 2020, 3:43 PM IST

‘విజేత’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కల్యాణ్‌ దేవ్‌ (చిరంజీవి చిన్నల్లుడు) హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘సూపర్‌ మచ్చి’. పులి వాసు దర్శకుడు. రచితా రామ్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న ఈ నేపధ్యంలో ఇంత అర్జెంట్ గా షూటింగ్ మొదలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది.  

ప్రభుత్వం షూటింగ్ లకు ఫర్మిషన్  ఇచ్చినప్పటికీ దాదాపు పెద్ద హీరోలంతా షూటింగ్స్ కు దూరమయ్యారు. మెగాస్టార్  చిరంజీవి కూడా ఆచార్య షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. అయితే చిరంజీవి అల్లుడు మాత్రం డేర్ చేశాడు. కల్యాణ్ దేవ్ సెట్స్ పైకి వచ్చి సూపర్ మచ్చి షూటింగ్ స్టార్ట్ చేయటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ మెగా అల్లుడుని మామ చిరు ఆపలేదా అంటూ సోషల్ మీడియాలో చర్చలు. ఈ నేపధ్యంలో మెగా అల్లుడు ఇంత ధైర్యం చేయటానికి కారణమేంటి అనే విషయం కూపి లాగటం మొదలెట్టారు.

మన మీడియావారి పరిశోధన లో కొన్ని విషయాలు తేలాయి. ఇలాంటి కరోనా టైమ్ లో షూటింగ్ ప్రారంబించటానికి ఓ కారణం ఉందని తెలిసింది. నిజానికి  సూపర్ మచ్చి సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నది ప్యాచ్ వర్క్ తో పాటు రీషూట్ మాత్రమే. అంటే "సూపర్ మచ్చి" సినిమా ఎడిటింగ్ వెర్షన్ తో పాటు మొత్తం సిద్ధంగా ఉంది. అయితే ఎడిటింగ్ వెర్షన్ చూసిన చిరంజీవి కొన్ని మార్పులు చెప్పారట.చిరంజీవి చెప్పిన కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారంతే. ఆ షూట్  కూడా వారం రోజులు మాత్రమే. వారం అయినా ఇప్పుడు పూర్తి చేయాల్సిన పనేమి వచ్చింది అంటే..ఫస్ట్ కాపీ రెడీ చేసి  థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా మూవీని ఓటీటీకి ఇచ్చేయాలనే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారట. అందుకే ఈ హడావుడి  అని చెప్తున్నారు. 

రిజ్వాన్, ఖుషి మాట్లాడుతూ– ‘‘లవ్‌ స్టోరీ మిక్స్‌ చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. అటు మాస్‌ ఇటు కుటుంబ ప్రేక్షకులకి కల్యాణ్‌ దేవ్‌ పాత్ర నచ్చుతుంది. తమన్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ‘సూపర్‌ మచ్చి’ టైటిల్‌ సాంగ్‌ బాగా వచ్చింది. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతించడంతో మా షూటింగ్‌ మొదలుపెట్టాం. కల్యాణ్‌దేవ్, రచితా రామ్‌తో పాటు అజయ్‌పై కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మనోజ్‌ కుమార్‌ మావిళ్ల.

Follow Us:
Download App:
  • android
  • ios