Asianet News TeluguAsianet News Telugu

ఉందా లేదా మూవీ రివ్యూ రేటింగ్

  • చిత్రం : ఉందా లేదా
  • నటీనటులు : రామ‌కృష్ణ, అంకిత, కుమార్ సాయి, జీవా, రామ్‌జ‌గ‌న్ , ఝూన్సీ, ప్ర‌భావ‌తి తదితరు
  • సంగీతం : శ్రీ మురళీ కార్తికేయ
  • సినిమాటోగ్ర‌ఫీ : ప్ర‌వీణ్ కె బంగారి
  • స‌హానిర్మాత‌లు : అల్లం సుబ్ర‌మ‌ణ్యం,అల్లం నాగిశెట్టి
  • నిర్మాత : అయితం ఎస్ క‌మ‌ల్
  • ద‌ర్శ‌క‌త్వం : అమ‌నిగంటి వెంక‌ట శివప్ర‌సాద్
  • ఆసియానెట్ రేటింగ్ - 3/5
VUNDAA LEDA MOVIE REVIEW

జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం‘ఉందా..లేదా?’. రామకృష్ణ, అంకిత జంటగా  నటించిన ఈ మూవీని సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో విభిన్నమైన కథ, స్క్రీన ప్లే తో  రూపొందించామని చిత్ర యూనిట్  తెలిపింది. అన్నట్టుగానే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ సంపాదించారు. ఈ వారం సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ ఈ సినిమాలో విషయం ఉందా లేదా....

 

కథ : 

రాజా (రామకృష్ణ) డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అతని స్నేహితుడు పనిచేసే ఛానెల్ కు డాక్యుమెంటరీలు చేస్తుంటాడు. అలాంటి సమయంలో నందిని (అంకిత) పరిచయమౌతుంది. నందిని డాక్టర్. అనుకోకుండా పరచయమై మంచి ఫ్రెండ్స్ గా మారతారు. ప్రేమలో పడతారు. మరో వైపు రాజా హరిశ్చంద్ర హాస్టర్ లో రుబీనా అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఆత్మలు, దెయ్యాల కారణంగానే సూసైడ్ చేసుకున్నారని ప్రాథమికంగా నిర్దారిస్తాడు పోలీస్ ఆఫీసర్ (రామ్ జగన్). అయితే రుబీనాను తన తమ్ముడు ప్రేమించడం.. అతను రుబీనా చనిపోయిందని కోమాలోకి వెళ్తాడు. ఇదేదే మిస్టరీగా ఉండడంతో... రాజాను హాస్టల్ మీద ఓ డాక్యుమెంటరీ తీయమంటాడు. అలా రాజా డాక్యుమెంటరీ తీయడం మొదలు పెట్టిన తర్వాత పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇంతకూ ఆ హాస్టల్ లో దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది అసలు కథ. 

 

నటీనటులు : 

రామకృష్ణ కొత్త గా హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ చాలా బాగా చేశాడు. ఎవ్వరినీ ఇమిటేట్ చేయకుండా సహజంగా నటించాడు. తనకు  ఈ సినిమా నటుడిగా ఎంతో ప్లస్ అవుతుంది. హీరోయిన్ అంకిత బాగుంది. పెర్ పార్మెన్స్ విషయంలోనూ మార్కులు కొట్టేసింది. రుబినాగా మారినప్పుడు, హీరోని ఇష్టపడే సీన్స్ లో బాగా చేసింది. తన క్యారెక్టర్ కు బాగా ఇంపార్టెన్స్ ఉంది. దీంతో చాలా కేర్ ఫుల్ గా నటించింది. ఈ సినిమాకు అంకిత పెర్ ఫార్మెన్స్ బాగా ప్లస్ అయ్యింది. హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అనూష కూడా చాలా బాగా చేసింది. చాలా సీన్స్ లో తన టాలెంట్ చూపించింది. ఇక ఈ సినిమాకు రామ్ జగన్ మరో కీలక పాత్రలో కనిపించాడు. పోలీస్ ఆఫీసర్ గా తనదైన పెర్ పార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఝాన్సీ ఉన్నది కొద్దిసేపే అయినా పవర్ ఫుల్ రోల్ పోషించింది. హీరో ఫ్రెండ్ గా సాయి నవ్వులు తెప్పించాడు. జీవా ప్రొఫెసర్ గా ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. సౌండ్ గురించి తాను చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ప్రభావతి కూడా ఎవ్వరూహించని పాత్రలో మెప్పించింది. 

 

సాంకేతిక నిపుణులు: 

శ్రీ మురళీ కార్తికేయ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా సన్నివేశాల్ని నిలబెట్టాడు.  ప్రవీణ్ బంగారి కెమెరా పనితనం ఎడిటింగ్ సరిగ్గా కుదిరాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టి క్వాలిటీ సినిమా తీశారనిపించింది. గ్రాఫిక్స్ విషయంలో సైతం రాజీ పడలేదు. అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు వెంకట శివ ప్రసాద్ గ్రాఫిక్స్ చేయించుకున్నాడు. రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా ఉంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. సౌండ్ పొల్యూషన్, పారా నార్మల్ యాక్టివిటీ, బై పోలార్ డిజార్డర్, సౌండ్ హిప్నాటిజమ్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ విషయాల గురించి దర్శకుడు బాగా రీసెర్చ్ చేసినట్టున్నాడు. ప్రతీ చిన్న విషయాన్ని చాలా క్లారిటీ గా గ్రాఫిక్స్ రూపంలో చూపించాడు. దీంతో కథ మీద ఇంట్రస్ట్ పెరిగింది. అసలు నిజాలు తెలిసే వరకు కథలో అనేక మలుపులు ఉన్నాయి. దర్శకుడి తొలి సినిమానే అయినప్పటికీ... చిన్న చిన్న పొరపాట్లున్నప్పటికీ... చాలా వరకు సక్సెస్ సాధించాడనే చెప్పాలి.

చివరగా:

హార్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని ఇష్టపడే వారికి ఈ వారం బెస్ట్ ఛాయిస్ ఉందా లేదా.

Follow Us:
Download App:
  • android
  • ios