Asianet News TeluguAsianet News Telugu

అర్జున్ తో వివాదం.. మరోసారి స్పందించిన విశ్వక్ సేన్, ఏమన్నారంటే..?

యాక్షన్ కింగ్ అర్జన్.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఈ ఇద్దరి మధ్య ఆ మధ్య జరిగిన వివాదం అదరికి తెలిసిందే.. ఆ వివాదం పై విశ్వక్  కూడా  అప్పుడు క్లారిటీ  ఇచ్చారు. ఇక అది ఎప్పుడో ముగిసింది.. అనుకున్నారంతాం..  ఇక మరోసారి ఈ వివాదంపై విశ్వక్ సేన్  స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ ఆయన ఏమన్నాడు.
 

Vishwak Sen Reacts again Action King Arjun Movie Controversy JMS
Author
First Published Mar 20, 2023, 7:45 AM IST


విశ్వక్ సేన్ యమా జోరుమీద ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్లాక్ బస్టర్స్ కాకపోయినా.. క్లాసిక్ హిట్లతో.. మాస్ హిట్లతో జోరు పెంచాడు. అంతే కాదు అప్పుడప్పుడు డైరెక్షన్ కూడా చేస్తూ.. షాక్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్  స్వీయ దర్శకత్వంలో.. తానే హీరోగా ధమ్కీ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈనెల 22న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్. సినిమా రిలీజ్ దగ్గర్లో ఉండటంతో ప్రమోషన్లు యమా జోరుగా సాగిస్తున్నారు. విశ్వక్ రెస్ట్ లెస్ గా ప్రమోషన్స్ లో పాల్గోంటున్నారు.   ఈసందర్భంగా  ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.  తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విశ్వక్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. అర్జున్ సినిమా వివాదంలో.. మీరు ఆయనకు డబ్బులు తిరిగి చెల్లించారా? అని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నకు విశ్వక్ సమాధానం ఇచ్చాడు.

మీడియా ప్రతి నిథి అడిగిన ప్రశ్నకు విశ్వక్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడ్డానికి  సమయం కాదు.. సందర్భమూ కూడా కాదు. అందుకే ఆ విషయం గురించి ఇప్పుడు  నేను మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఎంతో మందిపై ఉన్న గౌరవంతోనే నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు..  అంటూ వివరణ ఇచ్చాడు విశ్వక్ సేన్. సినిమా రిలీజ్ గురించి అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈమూవీ రిజల్ట్ ను బట్టి విశ్వక్ ఇమేజ్ టాలీవుడ్ లో పెరుగుతుందా..? తగ్గుతుందా అనేది తెలుస్తుంది. 

టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించాడు విశ్వక్ సేన్. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏకంగా ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నారు.  విశ్వక్ నటన అద్భుతం.  ఈనగరానికి ఏమైంది సినిమాలో.. రెండు మూడు రకాల ఎక్స్ ప్రెషన్స్ ను ఒకేసారి పలికించడం అంత ఈజీ కాదు. కాని అది విశ్వక్ చేసి చూపించాడు. ఫలక్ నూమా దాస్ ను డైరెక్ట్ చేశాడు.. అర్జున కళ్యాణం సినిమాలో తన మాస్ ఇమేజ్ కు కంప్లీట్ డిఫరెంట్ పాత్ర చేశాడు.. ఇప్పుడు దమ్కీని డైరెక్ట్ చేసి.. నటించాడు. అంటూ.. విశ్వక్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. అంతే కాదు విశ్వక్ ఇక దర్శకత్వం చేయకుండా ఉంటే మంచిది అంటూ సలహా కూడా ఇచ్చాడు. 

మనమంతా టాలీవుడ్ పతాకాన్ని అంతర్జాతీయంగా ఎగరేయాలి.. అది పడిపోకుండా చూడాలి.. దానికి అందరూ కృషి చేయాలి అన్నారు విశ్వక్. ఇక విశ్వక్ సేన్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. మరీ బ్లాక్ బస్టర్స్ పడకపోయినా..  డిజాస్టర్స్ మాత్ర తన కెరీర్ లో లేకుండా చూసుకుంటున్నాడు  విశ్వక్. అయితే తన సినిమాల విషయంలో మాత్రం ఇప్పటి వరకూ రెండు మూడు భారీ కాంట్రవర్సీలను  గట్టిగానే ఫేస్ చేశాడు విశ్వక్ సేన్. ఈ విషయంలో ఆడియన్స్ మద్దతు కూడా విశ్వక్ కు లభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios