సమంత ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో `సామ్‌జామ్‌`. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో ఇది రేపటి(నవంబర్‌ 13) నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రోమోని విడుదల చేశారు. ఇందులో మొదటి గెస్ట్ గా రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ వచ్చాడు. ఆయనతో సమంత ఓ రేంజ్‌లో ఆడుకుందని అర్థమవుతుంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ మీరు ఏ పర్‌ఫ్యూమ్‌ ఉపయోగిస్తారని అడగ్గా, `నా చెమట స్మెల్‌` అని తెలిపాడు విజయ్‌ దేవరకొండ. 

ఆ తర్వాత యూరప్‌ వెళ్ళారు కదా.. అక్కడ ఎవరిని హగ్ చేసుకోలేదా? అని అడగ్గా.. సచ్‌ ఏ నాటీ అని విజయ్‌ సమాధానమిచ్చాడు. ఆ  తర్వాత బోర్డ్ లో `రెబెల్‌`, `సింగిల్‌` ఉన్న గ్లాస్‌లను పగుల గొట్టాడు విజయ్‌. తాను రెబల్‌ అని, తాను పెళ్ళి చేసుకోలేదు కాబట్టి `సింగిల్‌` అని చెప్పినట్టు తెలుస్తుంది. 

అల్లరి చిల్లరగా సాగిన ఈ ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదే సమయంలో ఫస్ట్ టైమ్‌ కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ఈ షో సాగుతుందని అర్థమవుతుంది. మరి ఇది పూర్తి స్థాయిలో ఎలా  ఉండబోతుందనేది తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే. రేపు సాయంత్రం అల్లు అర్జున్‌ అతిథిగా ఈ `సామ్‌జామ్‌` షో ప్రారంభం కానుందని, అలాగే మరిన్ని ఈవెంట్లని పరిచయం చేయనున్నట్టు తెలుస్తుంది.