Asianet News TeluguAsianet News Telugu

మ‌ళ్ళీ గ్లామ‌ర‌స్ గా వ‌స్తున్న విద్యాబాల‌న్

  • డర్టీ పిక్చర్‌' తర్వాత ఆ స్థాయి గ్లామరస్‌గా మళ్ళీ ఇంతవరకు కన్పించని విద్యాబాల‌న్ .
  • ప్రస్తుతం 'కహానీ-2' సినిమా ప్రమోషన్‌ పనుల్లో బిజీగా వున్న బాలీవుడ్ భామ‌.
  • కావాల్సినంత  హాట్‌ అప్పీల్‌ పాత్రతో ప్రేక్ష‌కుల ముందుకు రాబొతున్న విద్యాబాల‌న్.
vidyabalan commited new movie

 

 ప్ర‌స్తుతం విద్యాబాల‌న్ కహానీ-2' సినిమా ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉంది.కహానీ-2' సినిమా ప్రమోషన్‌లో గ్లామర్‌ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతానికి గ్లామరస్‌ పాత్రలు చేయాలనే ఉద్దేశ్యం లేదని చెబుతూనే, తెరపై గ్లామరస్‌గా కన్పించాల్సి వస్తే.. కథ అంతలా డిమాండ్‌ చేస్తే తన ఆలోచనలు మారతాయని చెప్పిన విద్యాబాలన్‌, 'తుమ్‌హారీ సులు' సినిమాలో హాట్‌ అప్పీల్‌ పండిస్తానని చెప్పకనే చెప్పేసింది.

 
. ఈ సినిమాలో ఆమె పాత్ర ఓ లేట్‌ నైట్‌ షోకి యాంకర్‌గా పనిచేస్తుందట..అంటే మ‌ళ్లి అందాల‌ను తెర‌పై చూపించ‌డానికి సిద్ద‌మైన‌ట్లేన‌ని అభిమానులు ఆనంద‌ప‌డుతున్నారు. 'తుమ్‌హారీ సులు' , సినిమాలో  తన పాత్ర చాలా 'చిలిపి'గా వుంటుందని చెప్పింది. కొంచెం హాట్‌గా కొంచెం నాటీగా తన పాత్రని దర్శకుడు రాసుకున్నాడనీ, తన కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ ఫిలిం అవుతుందని చెప్పుకొచ్చింది విద్యాబాలన్‌. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు విద్యాబాల‌న్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios