మూడు కథలను ఎన్టీఆర్ కు వినిపించిన త్రివిక్రమ్ ఎందుకో మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్ళకుండానే ఆపేశాడు. అసలు త్రివిక్రమ్ చెప్పిన ఆ కథలేంటి? అనేవి ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తిని రేపుతోంది. 

రచయితగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకొని స్టార్ డైరెక్టర్ గా మారారు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు, గురూజీ అంటూ అందరి చేత ఆప్యాయంగా పిలవబడుతుంటారు. ఇక ఆయన ఎవరితో స్నేహం చేసినా వారు అంత సామాన్యంగా వదలరు. పవన్ కళ్యాణ్ - మహేష్ తో ఇదివరకే మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. 

ఇక తారక్ తో కూడా గత పన్నెండేళ్లుగా క్లోజ్ గానే ఉంటున్నారని చాలా లెట్ గా తెలిసింది. అసలు విషయంలోకి వస్తే.. గత పదేళ్లుగా తనతో సినిమా చేయాలనీ దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్లు తారక్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని తారక్ కు ముందు నుంచే ఒక ఆలోచన ఉన్నట్లు ఆయన మాటల్లోనే క్లారిటీగా అర్థమైంది.

అయితే మూడు కథలను ఎన్టీఆర్ కు వినిపించిన త్రివిక్రమ్ ఎందుకో మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్ళకుండానే ఆపేశాడు. అసలు త్రివిక్రమ్ చెప్పిన ఆ కథలేంటి? అనేవి ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తిని రేపుతోంది. అయితే ఆ కథల్లో రెండు త్రివిక్రమ్ వేరే హీరోలతో ఫినిష్ చేశాడని టాక్. అందులో సన్ ఆఫ్ సత్యమూర్తి అలాగే అఆ ఉన్నట్లు తెలుస్తోంది.

మరో కథను త్రివిక్రమ్ ఫినిష్ చేయకుండా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే విధంగా జల్సా తరువాత మొదట ఖలేజా కథ కూడా తారక్ కి వినిపించినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో చెప్పలేము గాని తారక్ కి చెప్పిన రెండు కథలను మాత్రం త్రివిక్రమ్ ఆయనకు సెట్ అవ్వవని చేస్తే మంచి యాక్షన్ ఎమోషన్ ఉన్న కథను ప్లాన్ చేయాలనీ ఆ కథలను వేరే హీరోలకు షిఫ్ట్ చేసినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు..

అరవింద కలెక్షన్స్.. తారక్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ వీకెండ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ