Asianet News TeluguAsianet News Telugu

అరవింద కలెక్షన్స్.. తారక్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ వీకెండ్!

ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఎమోషనల్ చిత్రం అరవింద సమేత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగురోజుల్లోనే చిత్రం 100 కోట్ల గ్రాస్ ను దాటేసి చిత్ర యూనిట్ కి సంతోషాన్ని ఇచ్చింది. 

aravindha sametha best first weekend collections  in ntr career
Author
Hyderabad, First Published Oct 15, 2018, 3:25 PM IST

ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఎమోషనల్ చిత్రం అరవింద సమేత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగురోజుల్లోనే చిత్రం 100 కోట్ల గ్రాస్ ను దాటేసి చిత్ర యూనిట్ కి సంతోషాన్ని ఇచ్చింది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం కావడంతో ఓపెనింగ్స్ ఎవరు ఊహించని స్థాయిలో వచ్చాయి. 

ఇకపోతే సినిమా ఫస్ట్ వీకెండ్ తారక్ కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అరవింద సమేత నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు బద్దలయ్యాయి. నైజం - ఏపిలో ఫస్ట్ వీకెండ్ 49 కోట్ల షేర్స్ అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 68కోట్ల షేర్స్ ను అందించింది. ఇక యూఎస్ లో నాన్నకు ప్రేమతో తరువాత ఆ స్థాయిలో డాలర్ల వర్షం కురిపించింది అరవింద సమేత. 

175 లొకేషన్స్ లో ఇప్పటివరకు చిత్రం 1.84మిలియన్ల డాలర్లను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ 111కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. 91కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ బడా సినిమా షేర్స్ పరంగా ఈ వారం ఇంకా రాబట్టగలిగితే బయ్యర్స్ కి లాభాలు అందుతాయి. మరి అరవింద సమేత ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.

 

సంబంధిత వార్తలు..

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

Follow Us:
Download App:
  • android
  • ios