ఒకప్పటి స్టార్ హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘తలైవి’.బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకుడు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌ దాదాపు తొమ్మిది నెలలపాటు పరిశోధనలు చేసి, జయలలిత జీవితం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో టీమ్ కు ఇబ్బందులు ఎదురౌతున్నాయట.

అందుతన్న సమచారం మేరకు ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ కు 350 మంది జనం అవసరం అవుతారట. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్దితుల్లో సోషల్ డిస్ట్రన్స్ అనేది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంతమంది జనం ఒకే చోట గుమి గూడితే కష్టం. దాంతో ఈ సీక్వెన్స్ షూట్ ని ఆపు చేసారట. అయితే ఇప్పుడు రిలీజ్ కు దగ్గరైన సమయంలో ఏదో విధంగా క్లైమాక్స్ ని ఫినిష్ చేయాలని, అందుకు తగ్గ ప్లాన్ ఎలా చేయాలా అని
టీమ్ తో చర్చలు జరుపుతున్నారట. గ్రాఫిక్స్ తో క్రౌడ్ ని క్రియేట్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
  
 ఇక ‘ఈ సినిమా హిందీ, తమిళ హక్కుల్ని రూ.55 కోట్లకు అమెజాన్‌, నెట్‌ప్లిక్స్‌కు ఇచ్చేశారు’ అని కంగన కూడా మీడియాతో అన్నారు. అయితే ముందు థియేటర్లలో విడుదల చేసిన తర్వాత ఓటీటీలోకి చిత్రం వస్తుందని తాజాగా యూనిట్‌ పేర్కొంది. సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. ‘జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ ఓటీటీలో ప్రదర్శించబోతున్నారు అనే వార్తలు అవాస్తవం.
ముందు థియేటర్‌లోనే విడుదలౌతుంది. దాని తర్వాత డిజిటల్‌లోకి వస్తుంది’ అన్నారు.

ఎ.ఎల్. విజయ్‌ ‘తలైవి’కి దర్శకత్వం వహిస్తున్నారు. జయలలితగా కంగన.. ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి కనిపించనున్నారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌, శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నట్లు తెలిసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కంగన కోలీవుడ్‌లో నటించిన సినిమా ఇది. ఫిబ్రవరిలో జయలలిత జయంతి సందర్భంగా దర్శక, నిర్మాతలు కంగన లుక్‌ను విడుదల చేశారు.