MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ఆ ఒక్కటీ అడక్కు ట్విట్టర్ రివ్యూ: అల్లరోడు నవ్వించాడా? హిట్టో ఫట్టో తేల్చేసిన ఆడియన్స్!

ఆ ఒక్కటీ అడక్కు ట్విట్టర్ రివ్యూ: అల్లరోడు నవ్వించాడా? హిట్టో ఫట్టో తేల్చేసిన ఆడియన్స్!


అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? వాళ్ళ రెస్పాన్స్ ఏమిటో చూద్దాం... 
 

Sambi Reddy | Published : May 03 2024, 07:34 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

ఒకప్పుడు కామెడీ చిత్రాల హీరోగా రాజేంద్రప్రసాద్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. తన జోనర్లో సూపర్ స్టార్ గా వెలిగాడు. ఈ జనరేషన్ రాజేంద్రప్రసాద్ అనిపించుకున్నాడు అల్లరి నరేష్. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అల్లరి నరేష్ పర్సనాలిటీకి కామెడీ హీరోగా బాగా సెట్ అవుతాడని నమ్మి ఆ దిగగా ఎంకరేజ్ చేశాడు. సూపర్ సక్సెస్ అయ్యాడు. 

 

29
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

అనతి కాలంలో యాభై చిత్రాలు పూర్తి చేసిన అల్లరి నరేష్ ఒక దశలో గ్యారంటీ హీరోగా నిర్మాతల హాట్ ఫేవరేట్ అయ్యాడు. అయితే కాలం ఒకేలా ఉండదు. అల్లరి నరేష్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఆయన కామెడీని ప్రేక్షకులు ఆస్వాదించడం మానేశారు. వరుస ప్లాప్స్ పడటంతో ..  కామెడీ జోనర్ వదిలేసి కొన్ని సీరియస్ చిత్రాలు చేశాడు. 

39
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

అది కూడా వర్క్ అవుట్ కాలేదు. మరలా కామెడీ వైపు అడుగులు వేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తెరకెక్కిందే ఆ ఒక్కటీ అడక్కు చిత్రం. ఈ మూవీలో అల్లరి నరేష్ పెళ్లి కాని ప్రసాద్ రోల్ చేశాడు. ఏజ్ బార్ అవుతున్నా అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడు పాత్ర చేశాడు. సోషల్ బర్నింగ్ టాపిక్ తో కామెడీ చేయాలనుకున్న అల్లరి నరేష్ ప్రయత్నం ఏ మేరకు పండింది అనేది చూద్దాం. 

 

49
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. ఇది ఓ దశాబ్దకాలంగా వేధిస్తున్న సమస్య. పెళ్లి ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుర్రాళ్లకు సంబందించిన వార్తలు మనం తరచూ చూస్తున్నాము. పెళ్లి కాకపోవడం ఒక బాధ అయితే... సొసైటీకి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్య. ఈ పాయింట్ ఆధారంగా తెరకెక్కిందే ఆ ఒక్కటీ అడక్కు. 

59
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్లుగా సాగుతుంది. దర్శకుడు పెళ్లిని బిజినెస్ గా మార్చేసిన విధానం. దాని చుట్టూ జరుగుతున్న వ్యాపారం, మాట్రిమోని సైట్స్ పాటించే పద్దతులను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు.ఈ డ్రామా ఒకింత నవ్వులు పూయిస్తుంది. 


 

69
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

పెళ్లికాని ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ చక్కగా సెట్ అయ్యాడు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం అల్లరి నరేష్ కి సహజంగా ఉన్న టాలెంట్. అల్లరి నరేష్ ఈ చిత్రంలో తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఫరియా తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ పంచడంలో సపోర్ట్  చేశారు. 

79
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్లుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ని కూడా కామెడీతో ఆరంభించిన దర్శకుడు సీరియస్ ఇష్యు వైపు మరలించాడు సందేశంతో కూడిన హాట్ సీన్స్, డైలాగ్స్ తో కథను మలుపు తిప్పాడు. క్లైమాక్స్ బాగుందని సోషల్ మీడియా ఆడియన్స్ అభిప్రాయం. 

89
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

దర్శకుడు ఇంకొంచెం కామెడీ పాళ్ళు పెంచి ఉండాలన్న మాట వినిపిస్తోంది. ఆయన రాసుకున్న కామెడీ సన్నివేశాలు కొన్ని పేలలేదు. పూర్తి స్థాయిలో నవ్వించలేకపోయాయి. గోపి సుందర్ మ్యూజిక్ కూడా మైనస్ అంటున్నారు. ముఖ్యంగా సాంగ్స్ నిరాశపరిచాయి అనే మాట వినిపిస్తోంది. 

 

99
Aa Okkati Adakku Twitter Review

Aa Okkati Adakku Twitter Review

మొత్తంగా ఆ ఒక్కటీ అడక్కు డీసెంట్ కామెడీ చిత్రం. హాస్యంతో పాటు సామాజిక సందేశంతో కూడిన సినిమా. కామెడీ చిత్రాలు ఇష్టపడేవారు, అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. వీకెండ్ కి ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. మల్లి అంకం దర్శకత్వం వహించగా.. రాజీవ్ చిలక నిర్మించారు. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories