బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన మృతిపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో సుశాంత్ మరణం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు.

మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అని మోదీ పేర్కొన్నారు. అలాంటి నటుడిని మనమంతా కోల్పోయామని చెప్పారు.సుశాంత్.. టీవీ, సినిమా రంగాల్లో రాణించాడని చెప్పారు. వినోద రంగంలో చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన సుశాంత్ చాలా మందికి స్ఫూర్తి అని చెప్పారు. అతని మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. అతని కుటుంబసభ్యులు, అభిమానులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. 

 

ఇదిలా ఉండగా..  ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   సుశాంత్ సింగ్ ఎందుకు  ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉన్నది.  సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  

ఎంఎస్ ధోని సినిమాతో సుశాంత్ సింగ్ మంచిపేరు తెచ్చుకున్నారు.  2008లో సుశాంత్ సింగ్ స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు.  ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమ్రోగిపోయింది.  

ఆ తరువాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు.  ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు.  కొన్ని రోజుల క్రితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.