Search results - 75 Results
 • icc

  CRICKET21, Jan 2019, 5:11 PM IST

  ధోనికి ఐసిసి అరుదైన గౌరవం...

  మహేంద్ర సింగ్ ధోని...భారత క్రికెట్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఓ వెలుగు వెలిగిన ఆటగాడు. తన ధనా ధన్ షాట్లతో పాటు ఎవరికి అందని ఎత్తుగడలతో ఓ వైపు బ్యాట్ మెన్‌గా, మరోవైపు సారథిగా టీంఇండియాకు అనేక మరుపురాని విజయాలు సాధించిపెట్టాడు. అయితే అతడు గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోవడంతో తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఓ సందర్భంలో
  ధోనిని జట్టులోంచి తొలగించాలన్న డిమాండ్ మరీ ఎక్కువయ్యింది. ఇలా గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న ధోనీ ఆస్ట్రేలియా వన్డే సీరిస్‌లో తన ఆటలో పదునెంతో మరోసారి నిరూపించి తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాడు. ఇలావిమర్శకుల నోళ్లు మూయించి గతంలో మాదిరిగానే అభిమానులకు తన ఆటతోనే చేరువయ్యాడు.  

 • dhoni jadhav

  CRICKET19, Jan 2019, 4:44 PM IST

  మెల్ బోర్న్ వన్డే గెలుపుకు కారణాలివే: కేదార్ జాదవ్

  ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే ఎదుర్కొని టీంఇండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఏ ఆసియా జట్టుకు సాధ్యం కాని ఆస్ట్రేలియా గడ్డపై  టెస్ట్ సీరిస్ సాధించడంతో పాటు వన్డే సీరిస్ ను కూడా కైవసం చేసుకుని  భారత జట్టు రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలవడంలో నిర్ణయాత్మకంగా మారిని మెల్ బోర్న్ వన్డేను ధోని(144 నాటౌట్), కేదార్ జాదవ్‌(64 నాటౌట్) అత్యుత్తమ భాగస్వామ్యమే గెలిపించిందనడంలో అతిశయోక్తి లేదు. కీలక వికెట్లను కోల్పోయిన సమయంలో వీరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించడమే కాదు సీరిస్ ను కూడా గెలిపించారు. 

 • dhoni

  CRICKET19, Jan 2019, 12:49 PM IST

  రిటైర్మెంట్‌పై మరోసారి స్పందించిన ధోని...(వీడియో)

  ఆస్ట్రేలియా జట్టుపై నిర్ణయాత్మక చివరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని  మ్యాచ్ విన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రౌండ్ లోంచి బయటకు వస్తూ ధోని తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని జట్టు కోచింగ్ సిబ్బందితో అన్న మాటలు రికార్డయి టివీలో ప్రసారమయ్యాయి. ధోని సరదాగానే అన్న ఈ మాటలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 

 • Dhoni

  CRICKET19, Jan 2019, 10:14 AM IST

  సచిన్ ను కెలికి ధోనీని ఆకాశానికెత్తిన రవిశాస్త్రి

  భారత క్రికెట్‌  దిగ్గజాల్లో ఒకడిగా ధోనీ నిలుస్తాడని రవిశాస్త్రి కొనియాడాడు. డకౌట్‌ అయినా, సెంచరీ కొట్టినా, ప్రపంచ కప్‌ గెలిచినా, తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఒకే విధంగా స్వీకరించే ధోని స్వభావం తనను ఆశ్చర్యపరుస్తుందని అన్నాడు. 

 • SPORTS19, Jan 2019, 10:03 AM IST

  ఓటమికి ధోనీనే కారణం, మా తప్పిదమే..ఆసిస్ కోచ్

  తాము ఓడిపోవడానికి టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కారణమని ఆసిస్ టీం కోచ్  జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డారు. 

 • MS Dhoni

  CRICKET19, Jan 2019, 9:58 AM IST

  ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

  తాను ఫలానా స్లాట్ లోనే ఆడాలనే నియమం ఏమీ పెట్టుకోబోనని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ధోనీ చెప్పాడు.

 • mahesh babu

  ENTERTAINMENT19, Jan 2019, 8:04 AM IST

  అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

  ఆస్ట్రేలియాపై విజయం సాదించిన టీమిండియానకు మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియాలో తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచిన టీమిండియాకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

 • CRICKET19, Jan 2019, 7:51 AM IST

  మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

  చాహల్ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తొలి దెబ్బ కొట్టగా, 87 పరుగులు చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. ధోనీ భారత్ కు విజయాన్ని అందించడం వెనక ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ తప్పిదం ఉంది.

 • dhoni shot in australia

  CRICKET18, Jan 2019, 9:14 PM IST

  2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

  ఆస్ట్రేలియా జట్టుపై భారత్ సాధించిన వన్డే సీరిస్ విజయంలో మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్ర పోషించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ వన్డేల్లో చివరి వరకు నాటౌట్ గా నిలిచి కీలకమైన విన్సింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా 2019 ఆరంభంలో వరుస మ్యాచుల్లో చెలరేగిన ధోని విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు.  

 • Dhoni Finishing

  CRICKET18, Jan 2019, 6:50 PM IST

  సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

  ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సీరిస్‌లో టీఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అదరగొట్టాడు. మూడు వన్డేల్లోనూ హ్యాట్రిక్ హాప్ సెంచరీలతో చెలరేగిన ధోని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ  క్రమంలో అతడు వ్యక్తిగతంగా  కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 
   

 • chahal

  CRICKET18, Jan 2019, 5:43 PM IST

  వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్స్ మన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

  ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనను విజయవంతంగా ముగించింది భారత జట్టు. ఈ పర్యటనలో చివరిదైన మెల్ బోర్న్ వన్డేలో గెలిచి ఆసిస్ గడ్డపై వరుసగా టెస్ట్, వన్డే సీరిస్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలుపును నిర్ణయించే చివరి వన్డేలో మొదట బౌలింగ్ లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అద్భుతాలు సృష్టించగా, బ్యాటింగ్ లో మహేంద్ర సింగ్ ధోని ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు కలిసి  సమన్వయంతో ఆస్ట్రేలియాకు చెందిన కీలక బ్యాట్ మెన్ ను ఔట్ చేసి ఔరా అనిపించారు. 

 • MS Dhoni

  CRICKET18, Jan 2019, 4:49 PM IST

  ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

  నాలుగో స్థానంలో అంబటి రాయుడు కుదురుకున్నప్పటికీ ధోనీయే ఆ స్థానానికి సరైన ఆటగాడని రోహిత్ శర్మ అన్నాడు. ఇది తన వ్యక్తిగతమైన అభిప్రాయమని చెబుతూ తుది నిర్ణయం కోచ్, కెప్టెన్లదేనని అన్నాడు.

 • india win odi series

  CRICKET18, Jan 2019, 4:46 PM IST

  వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

  మెల్ బోర్న్ వన్డేలో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంతో టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముఖ్య పాత్ర పోషించారు. ఇలా ఆసాంతం వన్డే సీరిస్‌లో రాణించి టీంఇండియా గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ధోని మరోసారి తనకు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని...జట్టు విజయమే ముఖ్యమని నిరూపించాడు. 

 • CRICKET17, Jan 2019, 4:37 PM IST

  అతడే అత్యుత్తమ గేమ్ ఫినిషర్: సచిన్

  ఆస్ట్రేలియా జట్టుపై అడిలైడ్‌  వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని ఆటతీరు అద్భుతమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. చివరి నిమిషంలో ఒత్తిడిని తట్టుకుని...వికెట్‌ను కాపాడుకుంటూ విన్నింగ్ షాట్ కొట్టడం అంత సులువైన విషయం కాదని అన్నారు. అందుకే ధోనికి గేమ్ ఫినిషర్ అన్న పేరు వచ్చిందని..నిజంగానే అతడు అత్యుత్తమ గేమ్ ఫినిసర్ అని మరోసారి నిరూపించుకున్నాడంటూ సచిన్ కొనియాడారు.

 • dhoni

  CRICKET17, Jan 2019, 8:57 AM IST

  ధోనీ షార్ట్ రన్ గుట్టు విప్పిన ఆడమ్ గిల్ క్రిస్ట్

  తొలి వన్డేలో చేసిన తప్పిదం భారత్‌ విజయకాశాలను  దెబ్బ తీసింది. రెండో వన్డేలో మాత్రం అది కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ, ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.