గరుడవేగలో సన్నీలియోని ఐటమ్ నంబర్ సన్నీ ఐటమ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల దసరా సందర్భంగా సన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన గరుడవేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు
గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన పీఎస్‌వీ గరుడవేగ 126.18 సినిమాలో బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ఓ ఐటం సాంగ్ చేస్తోందని.. ఆ పాట ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుందని తరచుగా చెబుతూ వస్తోన్న పీఎస్‌వీ గరుడవేగ మూవీ యూనిట్ సభ్యులు తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రాయిస్ సినిమాలో లైలా మై లైలా సాంగ్‌లో కనువిందు చేసిన విధంగానే గరుడవేగ సినిమాలోని ఐటంసాంగ్‌లోనూ సన్నిలియోన్ సెక్సీ లుక్స్‌తో అదరగొట్టింది. సన్నిలియోన్ అభిమానులకి దసరా కానుకగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వారిని తెగ టెంప్ట్ చేస్తోంది.
చేసిన ఈ సినిమాలోని డియో డియో అనే ఐటంసాంగ్ అతి త్వరగానే వైరల్ అవడం ఖాయం అని ధీమా వ్యక్తంచేసింది సన్నిలియోన్. యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కి విష్ణు దేవ కొరియోగ్రఫీ అందించాడు.
