రాజశేఖర్ కూతురు శివానీ అడివి శేష్‌ తో మొదలుపెట్టింది

రాజశేఖర్ కూతురు శివానీ అడివి శేష్‌ తో మొదలుపెట్టింది

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అడివి శేష్ హీరోగా  ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానుంది. వెంక‌ట్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన `2 స్టేట్స్` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. రాజ‌శేఖ‌ర్‌, జీవిత త‌న‌య శివాని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచయం అవుతున్నారు. శివాని తొలి చిత్రం కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ నటన కు ఎంతో ఆస్కారం ఉన్న ఈ కథను ఎంచుకోవడం విశేషం.

 

బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్క‌నుంది.  దర్శకుడు వెంకట్ రెడ్డి  వి.వి. వినాయక్ తో అసోసియేట్ గా  చాలా చిత్రాలకు పనిచేసారు.  ఈ  సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ :  ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత : ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం :  వెంక‌ట్ రెడ్డి

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page