Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో అర్జున్ రెడ్డి హిరోయిన్ షాలినికి అస్వస్థత

  • నెల్లూరులో ఓ మొబైల్ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన షాలిని
  • అర్జున్ రెడ్డి సినిమాతో సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన షాలిని
  • నెల్లూరులో స్పృహ తప్పి పడిపోయిన షాలిని, అసుపత్రికి తరలింపు
shalini panday sudden ill health

నెల్లూరులోని ఓ మొబైల్ షాపు ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది అర్జున్ రెడ్డి హిరోయిన్ షాలిని. అయితే సడెన్ గా స్పృహతప్పి పడిపోయింది షాలిని. తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న షాలిని నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. దాంతో ఆసుపత్రిలో వున్న పేషంట్స్ ఇతర సిబ్బంది షాలిని ని చుట్టు ముట్టి ఊపిరాడకుండా చేయడంతో.. అక్కడ్నించి పంపించే క్రమంలో మొత్తం ముఖం కనిపించకుండా స్ట్రెచర్ పై వేసి కారులో ఎక్కించి తరలించారు.

 

అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా షాలినికి సెలెబ్రిటీ హోదా వచ్చేసింది. సడెన్ గా లైమ్ లైట్ లోకి రావటంతో సెలెబ్రిటీగా మారిన షాలినిని పలువురు తమ షాపు ఓపెనింగులకు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. అయితే అర్జున్ రెడ్డి హిరోయిన్ షాలినికి తన తండ్రితో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షాలిని అనారోగ్యానికి అదేమైనా కారణమా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న షాలిని ప్రస్థుతం నిలకడగా వున్నట్లు సన్నిహితులు స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios