Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ఫ్లాఫ్ సినిమా టైటిల్ తో షారుఖ్ మూవీ!

ఇదే టైటిల్ తో బాలయ్య హీరోగా ఓ సినిమా వచ్చింది. కానీ ఆడలేదు. ఈ చిత్రం 2015 మే 14 న విడుదలై, ఫ్లాఫ్ టాక్ ను అందుకుంది. ఇది " టోటల్ రీకాల్ " చిత్రం ఆధారంగా రూపొందించబడింది.
 

Shah Rukh Khans Next With Atlee Titled 'Lion'?
Author
Hyderabad, First Published Sep 16, 2021, 3:48 PM IST

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకప్పుడు వరుస హిట్లతో బాలీవుడ్ లో నెంబర్ వన్ గా ఎదిగిన షారుఖ్ ప్రస్తుతం.. వరస డిజాస్టర్స్ సినిమాలతో దెబ్బ దెబ్బ తగిలి కొత్త నీరు అయినా ఆ మరకలు చెరపేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అట్లీ టచ్ అయ్యాడు. వరుస సక్సెస్ లతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు అట్లీ. అట్లీ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి హిట్టయ్యాయి. డైరక్టర్ గా తన ఖాతాలో ఉన్నవి తక్కువ సినిమాలే అయినా టాప్ డైరెక్టర్‌గా మారిపోయాడు.దాంతో షారూఖ్ ని డైరక్ట్ చేయటానికి ఛాన్స్ వచ్చింది. అలా షారుఖ్ ఖాన్‌తో అట్లీ సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా పూనేలో ప్రాజెక్టు ప్రారంభమయ్యింది.  2019 నుంచి షారుఖ్‌ - అట్లీల చిత్రంపై ఇప్పటికే అనేక రకాల వార్తలు వచ్చాయి. 

ఈ క్రమంలో  ఈ సినిమా టైటిల్ బయిటకు వచ్చింది. నయనతార, ప్రియమణి హీరోయిన్స్‌గా  చేస్తున్న ఈ సినిమాకి "లయన్" అనే పవర్ ఫుల్ టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారట. త్వరలో దీనిని అఫీషియల్‌గాను అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇదే టైటిల్ తో బాలయ్య హీరోగా ఓ సినిమా వచ్చింది. కానీ ఆడలేదు. ఈ చిత్రం 2015 మే 14 న విడుదలై, ఫ్లాఫ్ టాక్ ను అందుకుంది. ఇది " టోటల్ రీకాల్ " చిత్రం ఆధారంగా రూపొందించబడింది.ఇక ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.  అందులో ఒకటి ఎన్‌.ఐ.ఏ. అధికారి కాగా మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా‌.

 ఈ సినిమా నేపథ్యం నోట్ల ముద్రణ, బ్యాంకు దోపిడీ లాంటి అంశాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. ‘మనీ హైస్ట్‌’లాంటి బ్యాక్‌డ్రాప్‌ అంటున్నారు. మరోవైపు చాలా రోజుల క్రితం ‘మనీ హైస్ట్‌’ హక్కుల్ని షారుఖ్‌ ఖాన్‌ తీసుకున్నాడని వార్తలొచ్చాయి.   ఈ సినిమా పై షారుక్ అభిమానులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో ప్రక్క షారుఖ్‌ - సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ‘పఠాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు.హీరోయన్ గా దీపికా పదుకొణె నటిస్తుండగా జాన్ అబ్రహం విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios