Asianet News TeluguAsianet News Telugu

Samantha: వందసార్లు పడ్డాను.. ప్రతిసారి లేచి నిలబడ్డాను.. సమంత ఆసక్తికర కామెంట్స్


వరుస వెకేషన్స్ తో సమంత (Samantha) జోరు మీదున్నారు.  ఏమాత్రం కొంచెం విరామం దొరికినా విహారాలకు చెక్కేస్తున్నారు. ప్రస్తుతం స్వీట్జర్లాండ్ టూర్ లో ఉన్న సమంత అక్కడ సాహస క్రీడల్లో పాల్గొంటున్నారు. 

samantha shares her tour Switzerland experiences in social media
Author
Hyderabad, First Published Jan 28, 2022, 11:27 AM IST

సమంత స్వీట్జర్లాండ్   టూర్ సాహసోపేతంగా సాగుతుంది. ఆమె అక్కడ ప్రమాదకర ఆటల్లో శిక్షణ తీసుకుంటున్నారు. తన సాహసాల గురించి ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. మంచుపై వేగంగా జారుతూ పోయే సాహస క్రీడను స్కీయింగ్ అంటారు. గడ్డకట్టే చలిలో మంచు కొండలపై ఆడే ఈ ఆట అంత సులభం కాదు. ప్రొఫెషనల్స్ కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం మంచు చరియలు విరిగిపడి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి, 

స్వీట్జర్లాండ్ టూర్ లో సమంత ఈ క్రీడలో నైపుణ్యం సాధిస్తున్నారు. ఇక స్కీయింగ్ నేర్చుకునేటప్పుడు తన అనుభవం ఏమిటో కూడా సమంత తెలియజేశారు. మొదట చిన్న చిన్న మంచు దిబ్బలపై ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సమంత వంద సార్లు క్రింద పడిపోయారట. అయినప్పటికీ పట్టు వదలకుండా నేర్చుకున్నానని సమంత చెబుతుంది. అలాగే తనకు ఈ క్రీడలో శిక్షణ ఇచ్చిన ట్రైనర్ కి ధన్యవాదులు చెప్పింది. 

మరి జీవితంలో అనేక ఒడిదుడుకులు చూసిన సమంతకు ఇవేమీ అంత కష్టమైన పనులు కాదు. సమంత జీవితంలో కూడా అనేకమార్లు పడిపోయి తిరిగి పుంజుకుంది. ఇక సమంత అనేక కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు సమాచారం.  గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేస్తున్న శాకుంతలం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే మరో పాన్ ఇండియా చిత్రం యశోద చిత్రీకరణ దశలో ఉంది. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే లతో ఓ సిరీస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు సమంత విడాకుల వివాదం కొనసాగుతూనే ఉంది. సమంత తానుగా విడాకులు కోరుకున్నట్లు నాగార్జున(Nagarjuna) చేసిన కామెంట్ సంచలనం రేపింది. అయితే తన మాటలు వక్రీకరించారు. సమంత విడాకులు కోరుకున్నట్లు నేను చెప్పలేదని నాగార్జున సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. నాగ చైతన్య(Naga Chaitanya)-సమంత విడాకులకు కారణం ఏదైనా రచ్చ తగ్గడం లేదు. ఏదో ఒకవిధంగా ఈ విషయం చర్చల్లో ఉంటుంది. 

విడాకుల తర్వాత మాత్రం సమంత జోరు పెంచారు. ఆమె కెరీర్ పై ఫోకస్ తో దూసుకు వెళుతున్నారు. పుష్ప లో సమంత చేసిన ఐటెం సాంగ్ హైలెట్ కావడం జరిగింది. బాలీవుడ్ లో ఎదిగేలా సమంత ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో నెగటివ్ రోల్ చేసిన సుమంత హిందీ ప్రేక్షకుల మైండ్స్ లో రిజిస్టర్ అయ్యారు. శాకుంతలం, యశోద పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల కానున్నాయి. కాబట్టి సమంత అక్కడ సక్సెస్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios