Asianet News TeluguAsianet News Telugu

సమంతను తీసుకునేందుకు నిర్మాతల మొహమాటం

  • పెళ్లయినా నటిస్తానంటున్న సమంత
  • అభ్యంతరం లేదంటున్న నాగచైతన్య
  • మొహమాట పడుతున్న నిర్మాతలు
  • అక్కినేని నాగార్జున కాబోయే కోడలు కావటమే అడ్డంకి
samantha says nagarjuna wants her to do films

తెలుగు తెరపై అనతికాలంలోనే సత్తాచాటిన నటీమణుల్లో సమంత ముందుంటుంది. దాదాపు సమంత నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ మూవీసే. ఈమెపై అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పాలంటే ఆమె సోషల్ సైట్స్ ఫాలోవర్స్ సంఖ్యను బట్టే తెలుస్తోంది. సమంత ఇప్పుడు అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడింది. త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి కూడా జరగబోతోంది. మరి పెళ్లి తర్వాత సమంత నటిస్తుందా లేదా అన్నది సగటు అభిమాని మదిని తొలుస్తున్న ప్రశ్న.

 

నాగ చైత‌న్య - స‌మంత త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నది కన్ఫమ్ అని అందరికీ తెలుసు. కానీ పెళ్లి తర్వాత సమంత నటిస్తుందా లేదా అన్న విష‌యంపై నాగ చైత‌న్యను అడిగితే... నాక‌న్నా ఎక్కువ సినిమాల్లో స‌మంతే న‌టిస్తుంది అని చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ పెళ్లి త‌ర్వాత స‌మంత న‌టిస్తుందా లేదా అనే విష‌యం పై చాలా మందికి అనుమానం ఉంది. మరోవైపు స‌మంత పెళ్ళి వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. కానీ నటనంటే సమంతకు ప్రాణమని చెప్తోంది. తను త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నటించబోతున్నానని ట్విట్టర్ ఎకౌంట్ లో కన్ఫమ్ చేసింది సామ్.

 

సమంత తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి ట్వీట్ చేసినా ఆఫర్లు రావట్లేదని జోరుగా ప్రచారం మాత్రం జరుగుతోంది. కార‌ణం ఏంటని స‌మంత‌నే అడిగితే... “స‌మంత నాగార్జున కోడలు. ఆమెతో ఎలా ప‌ని చేయ‌గ‌లం అని నిర్మాత‌లు అనుకుంటున్నారు. నేను పెళ్లి త‌ర్వాత న‌టించ‌డం మానేస్తే ఆయ‌నే(నాగార్జున‌) ఎక్కువ బాధ‌ప‌డ‌తారు. అందుచేత పెళ్లి త‌ర్వాత న‌టించ‌డం మాన‌ను. ఇత‌రుల గురించి నాకు తెలియ‌దు కానీ...నేను మాత్రం పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తాను అంటోంది” అక్కినేని వారింట కాబోయే కోడలు స‌మంత‌.

 

మరి సమంతకు నటించాలనే ఉంది, నాగ చైతన్యకు కూడా అభ్యంతరం లేదు. కానీ సమంత పెళ్లి తర్వాత నటిస్తే అక్కినేని ఫ్యాన్స్ ఏ మేరకు ఎలా స్పందిస్తారో అనేది చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios