కండల వీరుడి సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడనేది.. దశాబ్దాల కాలంగా సమాధానం దొరకని ప్రశ్న. మీడియా సల్మాన్ ఖాన్ ని పెళ్లి గురించి అడగడం, అతడు సమాధానం దాటవేయడం ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. 

కండల వీరుడి సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడనేది.. దశాబ్దాల కాలంగా సమాధానం దొరకని ప్రశ్న. మీడియా సల్మాన్ ఖాన్ ని పెళ్లి గురించి అడగడం, అతడు సమాధానం దాటవేయడం ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. కానీ సల్మాన్ ఖాన్ జీవితంలో ప్రేమ కథలు మాత్రం బోలెడు ఉన్నాయి. ఇప్పుడు కూడా సల్మాన్ రొమేనియాకు చెందిన ఇలియా వంటూర్ అనే భామతో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవల ఇలియా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండడంతో బాలీవుడ్ లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఇలాంటి ప్రేమ కథలు చాలానే జరిగాయి. ఒక్కటి కూడా పెళ్లి వరకు చేరలేదు. దీనితో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకునే మూడ్ లో లేదని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. 

కానీ సంతానం కోసం సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో సల్మాన్ ఖానే స్పందించాలి. పెళ్లి కాకుండానే సల్మాన్ ఖాన్ పిల్లల్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. సంతానం కోసం సెలెబ్రిటీలు సరోగసి విధానాన్ని వినియోగించుకోవడం చూస్తూనే ఉన్నాం. సల్మాన్ కూడా సరోగసి ద్వారా సంతానం పొందాలని చూస్తున్నాడట. 

బాలీవుడ్ లో ఇప్పటివరకు కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్, లిసా రాయ్ లాంటి సెలెబ్రిటీలు సరోగసి విధానం ద్వారా సంతానాన్ని పొందారు. సల్మాన్ ఖాన్ కూడా పెళ్లి కాకుండా ఇదే మార్గాన్ని ఎంచుకుంటే అది సంచలనమే.