ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. చాలా కాలంగా పెళ్లి ఊసెత్తని టాప్‌ స్టార్‌లు కూడా త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ లాక్‌ డౌన్‌ కాలంలోనే పెళ్లి చేసుకోగా, నితిన్ కూడా త్వరలో ఓ ఇంటి వాడయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇక టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్ రానా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. ఆగస్టులో మూడు రోజుల పాటు రానా పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో యంగ్ టాలెంటెడ్‌ స్టార్ కూడా చేరిపోయాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజిత్‌. రెండో సినిమానే ప్రభాస్‌ లాంటి బిగ్గెస్ట్ స్టార్‌తో పాన్‌ ఇండియా లెవల్‌లో సాహో సినిమాను రూపొందించాడు. ఈ సినిమా రీజినల్‌గా ఆకట్టుకోకపోయినా హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా సుజిత్‌కు జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఏర్పడింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని భావిస్తున్నాడు. హైదరబాద్‌కు చెందిన డెంటల్‌ డాక్టర్ ప్రవళ్లికను సుజిత్ వివాహం చేసుకోబోతున్నాడట. మరో వారం రోజుల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరగనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.