Asianet News TeluguAsianet News Telugu

Alia bhatt:ప్రియుడుతో దివాళీ సెలెబ్రేట్ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ అలియా!

చాలా కాలంగా Ranbir kapoor, అలియా డేటింగ్ చేస్తున్నారు. తమ రిలేషన్ బహిర్గతం చేసిన ఈ జంట... మ్యారీడ్ కపుల్ మాదిరి, విందులు విహారాల్లో జంటగా పాల్గొంటారు. 

rrr heroin alia bhatt celebrates her diwali 2021 with boyfriend rabir kapoor
Author
Hyderabad, First Published Nov 5, 2021, 3:02 PM IST

బాలీవుడ్ క్రేజీ కపుల్ రన్బీర్ కపూర్, అలియా భట్ దివాళి వేడుకలను కలిసి జరుపుకున్నారు. అలియా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. బ్లూ లెహంగా, చోళీ ధరించిన అలియా రన్బీర్ కౌగిలిలో ఒదిగిపోయిన ఫొటో షేర్ చేశారు. అలాగే హ్యాపీ దివాళి అంటూ ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. 


ఇక చాలా కాలంగా Ranbir kapoor, అలియా డేటింగ్ చేస్తున్నారు. తమ రిలేషన్ బహిర్గతం చేసిన ఈ జంట... మ్యారీడ్ కపుల్ మాదిరి, విందులు విహారాల్లో జంటగా పాల్గొంటారు. వారాల తరబడి విహారాలకు చెక్కేస్తారు. ఏమాత్రం విరామం దొరికినా, కలిసి గడుపుతారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారని తరచుగా కథనాలు వెలువడుతూ ఉంటాయి. అయితే పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు ఈ స్టార్ కపుల్. 


ప్రస్తుతం ఇద్దరూ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. బ్రహ్మాస్త్ర పేరుతో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో రన్బీర్, Alia bhatt కలిసి నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ చేస్తున్నాడు రన్బీర్.  ఇక అలియా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూబాయ్ కతియావాడి మూవీలో నటిస్తున్నారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లూరి పాత్ర చేస్తున్న రామ్ చరణ్ ప్రేయసిగా, సీత పాత్ర చేస్తున్నారు అలియా. ఇటీవల విడుదలైన ప్రోమో ఆకట్టుకోగా, జనవరి 7న  గ్రాండ్ గా పలు భాషల్లో విడుదల కానుంది. RRR movie మూవీలో మరో హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. 

Also read ఎన్టీఆర్ కుడిచేతికి గాయం, సర్జరీ.. ఫ్యాన్స్ లో కంగారు, అసలేం జరిగిందంటే..

తమ చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో పెళ్లికి సమయం కేటాయించలేకున్నారు. మరోవైపు గతంలో రన్బీర్ లెక్కకు మించి అఫైర్స్ నడిపారు. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ తో పలువురు హీరోయిన్స్ తో అతడు అఫైర్స్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దీపికా పదుకొనెతో అతను స్ట్రాంగ్ రిలేషన్ నడిపారు. రన్బీర్ ప్రేమ కోసం పిచ్చిదైన దీపికా, చాలా కాలం డిప్రెషన్ తో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో కనీసం అలియాను అయినా పెళ్లి చేసుకుంటాడా లేక గతంలో మాదిరి ఈమెకు కూడా హ్యాండిస్తాడా అనేది ఉత్కంఠ కొనసాగుతుంది.

Also readబ్యాక్ చూపిస్తూ బ్యూటీ జాన్వీ కపూర్ హాట్ లుక్స్... ఆ యాంగిల్ లో లేత పరువాలు సరికొత్తగా చూపించిన అమ్మడు!

Follow Us:
Download App:
  • android
  • ios