Asianet News TeluguAsianet News Telugu

ఆర్జీవి సంచలన ప్రాజెక్ట్ ప్రారంభం.. కొండా సురేఖ, మురళి జీవితం ఆధారంగా `కొండా` సినిమా

ఆర్జీవీ రూపొందిస్తున్న `కొండా` చిత్రం వరంగల్ లో కొండా మురళి సొంత ఊరు వంచనగిరిలో మంగళవారం ఘనంగా ప్రారంభం అయింది. వంచనగిరి కోట గండి మైసమ్మ దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

rgv sensational movie konda shooting started at warangal
Author
Hyderabad, First Published Oct 12, 2021, 9:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనాత్మక కథాంశంతో సినిమా చేయబోతున్నారు. వరంగల్‌లోని కొండా మురళీ,కొండా సురేఖ జీవిత కథ ఆధారంగా `కొండా` సినిమాని తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ సినిమాని మంగళవారం ప్రారంభించారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్‌ సమర్పణలో యో యో టాకీస్‌ పతాకంపై మల్లారెడ్డి, నవీన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అరుణ్‌ ఆదిత్‌, ఇర్రామోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రం వరంగల్ లో konda murali సొంత ఊరు వంచనగిరిలో మంగళవారం ఘనంగా ప్రారంభం అయింది. వంచనగిరి కోట గండి మైసమ్మ దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. వరంగల్ ప్రజలు ఈ చిత్రం ఓపెనింగ్ కి భారీగా తరలి రావడం విశేషం. ఈ సందర్భంగా rgv మాట్లాడుతూ, `నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. విజయవాడలో చదువుకున్నాను, ఆంధ్రలో జరిగిన చరిత్ర అంత తెలుసు. కానీ తెలంగాణ చరిత్ర అంతగా తెలీదు. కొండా మురళి చరిత్ర చాలా గొప్పగా నచ్చింది. వాళ్ళ జీవిత కథని అందరికి తెలియాలని కొండా చిత్రాన్ని  నిర్మిస్తున్నాము. 

కొండా మురళి మామూలు మనిషి కాదు అని చాలా చెప్పారు. ప్రత్యేకమైన మనుషులు ప్రత్యేకమైన పరిస్థితుల్లో పుడతారు. ఎవరేం చేసిన, పుట్టిన పరిస్థితి, పెరిగిన పరిస్థితి అన్నీ కలిసి ఒక కలెక్టివ్ మైండ్ మీద ఎఫెక్ట్ ఇచ్చి అప్పుడు వారికున్న ధైర్యంతో  మంచి కోసం, న్యాయం కోసం ఎదురు తిరిగే దమ్ము చాలా తక్కువ మందికి ఉండగా మిగిలిన వారంతా కూడా బానిసలుగా వుంటారు. నేను వీరి కథ, జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత మహా దమ్మున్నోడు కొండా మురళి అని నేను తెలుసుకున్నాను. 

కొండ మురళి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏ డైరెక్టర్ కైనా తన కథ ఎంత ఫెంటాస్టిక్ ఉందనేది ముఖ్యం. నేను `శివ` నుంచి స్టార్ట్ అయ్యి `బాంబే` నుంచి తీసిన సినిమాల నుంచి కావచ్చు నా సినీ చరిత్రలో విన్న అత్యద్భుతమైన కథ konda movie . కొండా మురళి, konda surekha గార్ల కథను నేను నా టాలెంట్ తో వారి జీవిత చరిత్ర ను టెన్ పర్సెంట్ సినిమాలో పెట్ట గలిగినా నా ప్రయత్నం సక్సెస్ అయి కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. `కొండా` అనేది ఒక్క తెలంగాణకే పరిమితం కాకూడదని యూనివర్సల్ కావాలని ఈ సినిమా తీస్తున్నాను. `కొండా` లాంటి సినిమా ఇప్పటివరకు మీరు లైఫ్ లో చూసి ఉండరని నేను మీకు ప్రామిస్ చేస్తున్నా` అన్నారు.

also read: నాకు వోడ్కా.. మీకు విస్కీ.. మైసమ్మ దేవత ముందు రామ్‌గోపాల్ వర్మ పోస్టు వైరల్

 చిత్ర నిర్మాత ముకుంద్ మాట్లాడుతూ, వర్మ చరిత్ర సృష్టించే సినిమాలు తీశాడు. తన సినీ చరిత్రలో ఇంకో చరిత్ర సృష్టించే సినిమా `కొండా` అవుతుంది. `కొండా` అనే స్టోరీ వర్మ గారు ఒక్కసారి టేకింగ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈసారి చూడబోతున్నాం. 30 సంవత్సరాల కింద వచ్చిన `శివ` ఒక లెవల్ అయితే ఇది వేరే లెవెల్ అవుతుంది. ఈ సినిమాతో  ఊరిలో తిరిగే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా ఇది కొండన్న మూవీ అని కచ్చితంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఈ సినిమాతో కొండా దంపతులు సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని మేము చెప్పబో తున్నాను.

వర్మ గారు చూపించే ఈ "యదార్థగాథ" ఏ విధంగా ఉంటుంది,  రాజకీయంగా ఉంటుందా ? లవ్ స్టోరీ గా ఉంటుందా లేకపోతే మరో `రక్త చరిత్ర` క్రియేట్ అవుతుందా అనేది త్వరలో తెలుస్తుంది. ప్రపంచంలో  ఎక్కడో ఉన్నటువంటి మాఫియా డాన్ ల దగ్గర నుంచి గల్లీలో ఉండే రౌడీ వరకు ఎన్నో  కథలను చిత్రీకరించిన ఆర్.జీ.వి ఇలాంటి సినిమాలు తీయడం వెన్నతో పెట్టిన విద్య. సాధారణంగా ఒక మగ వాడి వెనక మహిళ ఉంటుంది అంటారు. కానీ ఒక మహిళ వెనక కొండన్న ఉన్నాడు. ఈ సినిమా విడుదల తర్వాత ప్రతి మహిళ  ధైర్యంగా మా వెంట కొండన్న ఉన్నాడు అనే విధంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది` అని అన్నారు. 

కొండా సురేఖ మాట్లాడుతూ, `మురళి గారు సైకిల్ మీద టమోటాలు పెట్టుకొని వరంగల్ మార్కెట్ కెళ్ళి అమ్మిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎవరి సపోర్ట్ లేకుండా రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి. మా పైన విమర్శలు చేసే వారిని నేను ఒక్కటే సవాల్ చేస్తున్న మీకు ధైర్యం ఉంటే మీ బయోపిక్ లు తీసుకోండి. మీ సొంత పైసలు పెట్టే చేయించుకోండి. అర్జీవి అన్న లాంటి డైరెక్టర్ తో తీసుకోండి. మేము కాదనము. మా జీవితాల వెనుక ఒక చరిత్ర ఉంది. మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరందరూ కూడా పెత్తందార్లు, భూస్వాములు, బడుగు బలహీన వర్గాల లను అణగదొక్కే టటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు,  ఎంతసేపు  పక్క వాళ్ళను ఎదగనీయకుండా చేసేటటువంటి గుణం ఉన్న వాళ్ళు.

 కానీ..  పేదవాడిని ప్రేమించే టటువంటి మనసున్న వ్యక్తి మురళి గారు పేదవాడికి పైకి తీసుకువచ్చే గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా దానమిచ్చే వ్యక్తి మురళీ గారు. ఈ గ్రామంలో మన అందరికీ తెలుసు స్కూలు, జూనియర్ కాలేజ్, 
మోడల్ స్కూల్ భూములు గాని ఇవన్నీ ఆయన ప్రజల కోసం ఇవ్వకపోతే కోట్ల రూపాయలను సొమ్ముచేసుకొనే వాడు. డబ్బుకు ఆశించకుండా తన భూమిని కూడా ఇచ్చేసి నటువంటి వ్యక్తి మురళి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మాత్రం కబ్జాలు చేసి కోట్ల రూపాయల దండుకునే ప్రయత్నం చేస్తున్నారు` అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios