రామ్ చరణ్, సుకుమార్ మూవీలో రాశిఖన్నా పేరు మూవీ కోసం సీరియస్ గా వర్కవుట్స్ చేస్తున్న రాశి ఖన్నా సడెన్ గా రాశిఖన్నా స్థానంలో సమంత పేరు

ధృవ సినిమా తర్వాత తాను సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో.. పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నట్టుగా చరణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో రాశీఖన్నా చేస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చేయడానికే కొంచెం సన్నబడాలని బాగా వర్కవుట్స్ చేసి ఆమె చెమటోడ్చి కష్టపడుతున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

ఇంతలో ఏమైందో తెలియదు కానీ.. ఉన్నట్టుండి ఇప్పుడు సమంత పేరు బయటకు వచ్చింది. జనతా గ్యారేజి తర్వాత దాదాపు ఏడాదిపాటు గ్యాప్ తీసుకున్న సమంత.. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తోందంటున్నారు.

రామ్ చరణ్-సుకుమార్ ల తదుపరి చిత్రంలోస రాశిఖన్నా చేయాల్సిన రోల్ ను సమంత ఎగరేసుకుపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జనతా గ్యారేజ్ విజయంతో పాటు.. చైతూతో పెళ్లి కుదిరిన తర్వాత మంచి సంతోషంగా ఉన్న సమంతకు ఇప్పుడు మరో తీపి కబురు అందినట్లు తెలుస్తోంది.

సుకుమార్ తన 'నాన్నకు ప్రేమతో' విజయం తర్వాత రాంచరణ్‌తో తీస్తున్న తదుపరి సినిమాకు సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం.