MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: దశరథ ఎమోషనల్- కార్తీక్, దీపలపై జ్యో డౌట్- జ్యోకు షాక్- పారుకు నిజం

Karthika Deepam 2 Today Episode: దశరథ ఎమోషనల్- కార్తీక్, దీపలపై జ్యో డౌట్- జ్యోకు షాక్- పారుకు నిజం

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 3వ తేదీ)లో కూతురి చేతులు పట్టుకొని ఏడ్చిన దశరథ. దీప, కార్తీక్ లపై డౌట్ పడిన జ్యో. నెల రోజులు లీవ్ ఇవ్వమన్న కార్తీక్. కుదరదు అన్న జ్యో. మనుమరాలికి షాక్ ఇచ్చిన శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Mar 03 2026, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో ఒక దగ్గర నిలబడి సుమిత్ర పరిస్థితి తలచుకొని బాధపడుతుంటాడు దశరథ. దీప, కార్తీక్ అక్కడికి వస్తారు. ఏం ఆలోచించావు మామయ్య అంటాడు కార్తీక్. నేను ఏం ఆలోచించలేకపోతున్నాను. నా భార్య కోసం నా కూతురి కడుపులో బిడ్డను ఎలా వదులుకోవాలి? కూతురితో పాటు కూతురి బిడ్డ కూడా రాబోతుందని సంతోషపడ్డాను. నా కూతురి విషయంలో చేసిన తప్పు మనుమరాలి విషయంలో సరిదిద్దుకోవాలి అనుకున్నాను. నా కూతురి బాల్యం నేను చూడలేదు. నా మనుమరాలి ద్వారా ఆ ఆశలు తీర్చుకోవాలని అనుకున్నాను అని ఎమోషనల్ అవుతాడు దశరథ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ సమస్యకు ఇదే పరిష్కారం
Image Credit : Jiohotstar

ఈ సమస్యకు ఇదే పరిష్కారం

నేను తండ్రిగా నీకు ఏం ఇచ్చానని ఇంత త్యాగానికి సిద్ధపడ్డావమ్మా అని దీప చేతులు పట్టుకొని ఏడుస్తాడు దశరథ. జన్మనిచ్చావు కదా నాన్న. అది చాలు, తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు సంతోషంగా ఉండాలి అనుకుంటారా? పిల్లలు తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని కోరుకోరా? తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ అవకాశం నాకు వచ్చింది. కాదు నా బిడ్డకు వచ్చిందని దీప కూడా ఏడుస్తుంది. అత్తలో నా బిడ్డను చూసుకుందాం. ఈ సమస్యకు ఇంతకంటే వేరే పరిష్కారం లేదు మామయ్య ఒప్పుకోండి అంటాడు కార్తీక్. ఏంటా సమస్య, ఏంటా పరిష్కారం అంటూ ఎంట్రీ ఇస్తుంది జ్యోత్స్న. తర్వాత శివన్నారాయణ, పారిజాతం కూడా వస్తారు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్- స్వప్న, కాశీ విడాకులు- దశరథ ఆవేదన
Related image2
Karthika Deepam 2 Today Episode:కార్తీక్, దీపలపై దశరథ ఫైర్-కార్తీక్ ఎమోషనల్-చావు బ్రతుకుల్లో సుమిత్ర
37
నువ్వే సమస్య
Image Credit : Jiohotstar

నువ్వే సమస్య

చెప్పు బావ.. ఏంటి ఆ సమస్య అని మళ్లీ అడుగుతుంది జ్యోత్స్న. శివన్నారాయణ కూడా అడుగుతాడు. పెద్దమేడమే సమస్య అంటాడు కార్తీక్. అదేంటి అని అడుగుతుంది పారు. అత్తకు ఆపరేషన్ అన్న ప్రతిసారి తమరు బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటున్నారు కదా. మామయ్య ఏమో అత్తను హాస్పిటల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నారు. నువ్వు మళ్లీ ఇల్లు వదిలి వెళ్లిపోతే సమస్య అవుతుంది. అందుకే నేను ఇంటికి కాపాలగా ఉంటానని చెప్పాను అని కవర్ చేస్తాడు కార్తీక్. మా మమ్మీని కాపాడుకోవడం నా బాధ్యత. నాకు ఎవరూ కాపలాగా ఉండాల్సిన అవసరం లేదు అంటుంది జ్యోత్స్న. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది అని మనసులో అనుకుంటుంది పారు.

47
మళ్లీ ప్రేమిస్తాను
Image Credit : Jiohotstar

మళ్లీ ప్రేమిస్తాను

మరోవైపు కాశీతో దాసు కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. నీకు కొంచమైనా బుద్ధి ఉందా? నీకు అంత తొందర ఎందుకు? విడాకుల పత్రాల మీద సంతకం ఎందుకు పెట్టావు అని సీరియస్ అవుతాడు దాసు. ఏం చేయను నాన్న.. స్వప్న విడాకులు తప్పా మరో మాట మాట్లాడటం లేదు అంటాడు కాశీ. అయితే నచ్చజెప్పాలి, బ్రతిమాలాలి, మార్చుకోవాలి. కానీ సంతకాలు చేస్తే ఎలా? అంటాడు దాసు.

నిండు నూరేళ్లు కలిసి ఉంటామని పెళ్లిలో చేసిన ప్రమాణాలు అన్నీ ఈ సంతకం ముందు ఓడిపోయినట్లేనా? ఇలా విడిపోవడానికేనా అందరిని ఎదురించి పెళ్లి చేసుకుంది? ఓ పని చేయ్. నాకు కూడా విడాకులు ఇవ్వు అంటాడు దాసు. విడాకుల కాగితంపై సంతకం పెట్టాను కానీ స్వప్నను వదులుకోను నాన్న అంటాడు కాశీ. అదేంటి అని అడుగుతాడు దాసు. ఇదో ట్రిక్ నాన్న. విడాకులు ఇస్తే స్వప్న కాస్త రిలీఫ్ అవుతుంది. అప్పుడు నేను తనని మళ్లీ ప్రేమించి.. నా ప్రేమతో తనను గెలుస్తాను అంటాడు కాశీ. ఆ మాట విని సంతోషిస్తాడు దాసు.

57
నా పర్మిషన్ తీసుకోవాలి
Image Credit : Jiohotstar

నా పర్మిషన్ తీసుకోవాలి

శివన్నారాయణతో రేపటి నుంచి ఓ నెల రోజులపాటు మేము పనికి రావడం లేదు అని చెప్తాడు కార్తీక్. ఎందుకు అని అడుగుతాడు శివన్నారాయణ. దీపకు రెస్ట్ చెప్పారు. మేము ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాము అని చెప్తాడు కార్తీక్. కుదరదు అంటుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ ప్రకారం మీరు లీవ్ తీసుకోవాలన్నా, మానేయాలన్నా, నా పర్మిషన్ తీసుకోవాలి అంటుంది జ్యోత్స్న.

67
జ్యోకు షాక్
Image Credit : Jiohotstar

జ్యోకు షాక్

దీప ఎక్కడికి వెళ్లదు. ఇక్కడే కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అంటుంది జ్యోత్స్న. అవసరం లేదు మాకు ఒక ఇల్లు ఉంది. మేము అక్కడే ఉంటాము అంటాడు కార్తీక్. సరే మీరు వెళ్లండి. మీకు నచ్చినప్పుడు రండీ అంటాడు శివన్నారాయణ. నేను ఒప్పుకోను అంటుంది జ్యోత్స్న. నీకు అగ్రిమెంట్ ముఖ్యమైతే ఆ రూ.10 కోట్ల ఫైన్ నేను కడతాను. లీవ్ ఇస్తావా? లేక అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా అని జ్యోత్స్నకు షాక్ ఇస్తాడు శివన్నారాయణ. సైలెంట్ అవుతుంది జ్యోత్స్న.

77
నిజం తెలుసుకున్న పారు
Image Credit : Jiohotstar

నిజం తెలుసుకున్న పారు

కార్తీక్, దీపలను ఆపి లీవ్ ఎందుకు అడిగారు ఏమైందని అడుగుతాడు దశరథ. దీపను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్తాడు కార్తీక్. నాన్న అనే పిలుపును వదులుకుంటావా? నీకు బాధగా లేదా అని అడుగుతాడు దశరథ. నీకు ఇది ఇల్లు మాత్రమే. కానీ నాకు దేవాలయం మామయ్య. అత్తే అక్కడ దేవత. అత్త లేకపోతే ఈ ఇంట్లో సందడే లేదు. నీ పుట్టింటిని గిఫ్ట్ గా ఇస్తానని నా భార్యకు మాటిచ్చా. కానీ తను మాత్రం తన తల్లి ప్రాణాలు కాపాడాలి అనుకుంటోంది. దేవుడు అంతే మామయ్య. అపురూపమైన దాన్ని తీసుకొని అమూల్యమైన దాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్.

మరోపక్క వీళ్ల మాటలను చాటుగా వింటూ ఉంటుంది పారు. దీప కడుపులో బిడ్డను వదులుకోవడం అంటే నా మనసు అంగీకరించడం లేదు అంటాడు దశరథ. దీపకు బిడ్డను వదులుకోవడం తప్ప వేరే దారి లేదు మామయ్య అంటాడు కార్తీక్. దీప బిడ్డను వదులుకోవడం ఏంటి అని షాక్ అవుతుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Recommended image2
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image3
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్- స్వప్న, కాశీ విడాకులు- దశరథ ఆవేదన
Recommended image2
Karthika Deepam 2 Today Episode:కార్తీక్, దీపలపై దశరథ ఫైర్-కార్తీక్ ఎమోషనల్-చావు బ్రతుకుల్లో సుమిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved