హీరోయిన్ రాధికా ఆప్టే ఎంత బోల్డ్ బ్యూటీనో అందరికి తెలుసు. అందాలు ఆరబోయడంలో, హాట్ సీన్స్ లో నటించడంలో ఆమెకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
హీరోయిన్ రాధికా ఆప్టే ఎంత బోల్డ్ బ్యూటీనో అందరికి తెలుసు. అందాలు ఆరబోయడంలో, హాట్ సీన్స్ లో నటించడంలో ఆమెకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది.
37 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ కి గురైంది. తాజాగా ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే ఇంగ్లీష్ మాట్లాడిన విధానం వినేవారికి చిరాకు తెప్పించే విధంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. రాధికా ఆప్టే మనసులో విషయాల్ని ధైర్యంగా చెబుతుంది అని తెలుసు.
అయితే తన మనసులో భావాల్ని వ్యక్తపరచడానికి ఇలా తన సూట్ కానీ ఫేక్ ఇంగ్లీష్ యాసలో చిరాకు పుట్టించడం అవసరమా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మహిళల త్యాగాలు, బాధ్యతల గురించి రాధికా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
వెస్ట్రన్ స్టైల్ లో ఇంగ్లీష్ మాట్లాడాలని రాధికా ఆప్టే గట్టిగానే ప్రయత్నించింది. కానీ అది ఆమెకి సెట్ కాలేదు అని అంటున్నారు. 'నేను పూర్తి వీడియో కూడా చూడలేదు. ఆమె యాసతో చిరాకు వచ్చింది. వీళ్లంతా ఫేక్ గా ఇంగ్లీష్ మాట్లాడాలని ఎందుకు ప్రయత్నిస్తారో' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేసింది.
మరో నెటిజన్ వీళ్లిద్దరి(యాంకర్ కూడా) ఇంగ్లీష్ స్కిల్స్ చూసి నిలుచున్న చోటే ఆగిపోయాను అని కామెంట్స్ చేశారు. 'ఆమె గతంలో ఎప్పుడైనా బ్రిటిష్ ఎంబసీలో వీసా కోసం అప్లై చేసి రిజెక్ట్ కి గురై ఉంటుంది. అప్పటి నుంచి ఇలా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తోంది అని మరో నెటిజన్ ఫన్నీ సెటైర్ వేశారు.
