Asianet News TeluguAsianet News Telugu

ప్రతి పావుగంటకో అత్యాచారం..మహిళలపై దాడులపై పూరీ సంచలన కామెంట్‌

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఉద్దేశిస్తూ `పూరీ మ్యూజింగ్స్`లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం జరుగుతుందన్నారు. 

puri jagannadh sensational comment on rapes on women arj
Author
Hyderabad, First Published Oct 5, 2020, 12:17 PM IST

టాలీవుడ్‌ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హథ్రస్‌ ఘటనని ఉద్దేశించి ఆత్యాచారాలపై సంచలన కామెంట్‌ చేశారు. 

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఉద్దేశిస్తూ `పూరీ మ్యూజింగ్స్`లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ప్రతి పావుగంటకు ఒక అత్యాచారం జరుగుతుందని, ప్రతి రోజు దాదాపు వంద లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయని, వీటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, న్యాయం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మనం ఓ సారి నిజాలు మాట్లాడుకుందామని స్టార్ట్ చేసిన పూరీ, మహిళలపై రోజూ నాలుగు లక్షలకుపైగా దాడులు జరుగుతున్నాయని, ఇటీవల హథ్రస్ లో జరిగిన సామూహిక అత్యాచారం వాళ్ల అత్యాచారం చేయడం మాత్రమే కాదు, అతి కిరాతకంగా హింసించారని తెలిపారు. 

మహిళలకు అన్యాయం జరిగితే న్యాయం జరగడం పక్కన పెడితే, న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తోందని, ఏంటీ ఈ ఖర్మ అని, దేశంలో ఆడవాళ్ళ కోసం ఆడవాళ్లే ఫైట్‌ చేయాల్సి వస్తోందన్నారు. మగవాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదని, కొన్నాళ్ళు సూసైడ్‌ ఫెస్టివల్స్..సుశాంత్‌ ఒక్కటే కాదు అదే సమయంలో భారత్‌లో 300 మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వాళ్ల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. 

గాల్వాన్‌ వ్యాలీలో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పేర్లు ఎవరికీ తెలియదు, కనీసం ఒక్కసారి ఆ మహావీరుల గురించి ఆలోచించారా? ఆ తర్వాత నెపోటిజం ఫెస్టివల్‌, అందరూ కలిసి ఒకర్ని తొక్కేస్తున్నారని ఫీలైపోవడం, అది అవివేకం, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఒక స్టార్‌. కొత్త హీరో సినిమాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఆ సమయంలో ఒక్క థియేటరైనా నిండిందా? కొత్త హీరోలను ప్రోత్సహింద్దామని మీరు టిక్కెట్టు కొన్నారా? చివరికి మీరు స్టార్స్ సినిమాలే చూస్తారు. 

ఇప్పుడు డ్రగ్స్ ఫెస్టివల్‌. సెలబ్రిటీలందర్నీ తీసుకెళ్ళి ఫ్యాషన్‌ పరేడ్‌లు పెట్టారు. ఆడవాళ్ల కోసం నిలబడండి, పోరాటం చేయండి, తెలంగాణలో దిశకు జరిగిన న్యాయం ఈ దేశంలో ప్రతి అమ్మాయికి జరగాలి. మొన్న ఆగస్ట్ 15న మనందరం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొన్నాం. అదే రోజు ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? అని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios