ఎవరీ సుధారెడ్డి..? గాలా లుక్ కోసం రూ.83కోట్లు ఖర్చు చేసింది..!
ఆమె ధరించిన డ్రెస్ కంటే... ఆ లుక్ కోసం ఆమె పెట్టిన ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ గాలా ఈవెంట్ కోసం ఆమె ఏకంగా 10మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
Sudha Reddy
ప్రముఖ స్టార్ స్టడెడ్ ఈవెంట మెట్ గాలా 2024 ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ ఈ వెంట్ న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు
ఈ మెట్ గాలా ఈవెంట్ లో ఇప్పటికే ఈషా అంబానీ, అలియా భట్ లు ఏవిధంగా మెరిశారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే.. వీరు మాత్రమే కాదు.. మరో భారతీయ యువతి కూడా... అదరహో అనిపించింది.
మన దేశానికి చెందిన ఓ యంగ్ వ్యాపారస్తులు ఈ గాలా ఈవెంట్ లో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆమె ధరించిన డ్రెస్ కంటే... ఆ లుక్ కోసం ఆమె పెట్టిన ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ గాలా ఈవెంట్ కోసం ఆమె ఏకంగా 10మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.83కోట్లు కావడం గమనార్హం.
ఈ గాలా ఈవెంట్ లో మెరవడం ఆమెకు ఇది రెండో సారి.. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మిషన్‌తో కలిసి సుధా రెడ్డి, తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. దీంతోపాటు 180 క్యారెట్ల 30 సాలిటైర్‌లతో కూడిన నెక్లెస్‌ను ధరించి గ్రాండ్ లుక్‌లో మెరిసింది. సుధా రైడి వద్ద ఉన్న పాతకాలపు చానెల్ బ్యాగ్ విలువ 33 లక్షలు. సుధా రెడ్డి పూర్తి లుక్ కోసం దాదాపు 10 మిలియన్లు అంటే 83 కోట్లు ఖర్చు చేసినట్లు వర్గాలు చెబుతున్నాయి
అంటే.. ఆమె ధరించిన డ్రెస్ కాదు.. జ్యూవెలరీ ఎక్కువ ధర పలకడం గమనార్హం. 200 క్యారెట్స్ ఉన్న డైమండ్ నక్లెస్ ని ఆమె ధరించారు. ఆ నక్లెస్ లో హార్ట్ షేప్స్ కూడా ఉన్నాయి. వాటిని తన భర్త, పిల్లలను రిప్రజెంట్ చేస్తూ ధరించడం విశేషం.
సుధా రెడ్డి ఎవరు?
సుధా రెడ్డి, డైరెక్టర్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సుధా రెడ్డి ఫౌండేషన్, యునిసెఫ్, గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఫైట్ హంగర్ ఫౌండేషన్ సామాజిక సేవలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది మెట్ గాలాకు హాజరైన అతికొద్ది మంది భారతీయుల్లో సుధా రెడ్డి ఒకరు. 2021లో, ఆమె మొదటిసారిగా ఫ్యాషన్ అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ మెట్ గాలాకు హాజరయ్యారు. ప్రస్తుతం సుధారెడ్డికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మరాయి.