పదే పదే మూత్రం ఎందుకొస్తుంది?
కొంతమంది తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటారు. దీనివల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్రకూడా రాదు. అయితే ఇలా ఎందుకు మూత్రం తరచుగా వస్తుందో తెలుసా?
చాలా మందికి పగలు , రాత్రి అనే తేడా లేకుండా పదే పదే మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ ఎందుకు ఇలా అవుతుందని మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించరు. ఆలోచించినా హాస్పటల్ కు వెళ్లి మాత్రం చూయించుకోరు. కానీ పదే పదే మూత్రం రావడం అస్సలు మంచిది కాదు. మీ శరీరం ఏదో సమస్యతో బాధపడుతుండటాన్ని ఇది సూచిస్తుంది. అసలు పదే పదే మూత్ర విసర్జన ఎందుకు చేయాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తరచూ మూత్ర విసర్జన సాధారణం?
సాధారణంగా రోజుకు 4 నుంచి 10 సార్లు మూత్ర విసర్జన చేయడం అవసరం. ఇది ఆరోగ్యకరమైన విషయం. అయితే రోజుకు ఒకటి లేదా రెండుసార్లు మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యానికి మంంచిది కాదు. ఇది అనారోగ్యకరమైనది. ఇలా అయితే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మూత్ర మార్గము అంటువ్యాధులు
మూత్ర మార్గము లేదా మూత్రాశయ సంక్రమణ వల్ల కూడా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి.
వైద్య సమస్యలు
మీరు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే మీకు కొన్ని సమస్యలు ఉన్నట్టే. అతి చురుకైన మూత్రాశయ సిండ్రోమ్, మూత్రాశయ క్యాన్సర్, యూటీఐ లేదా ప్రోస్టేట్ వంటి అనారోగ్య సమస్యలుంటే కూడా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
ఇంటర్స్టీషియల్ సిస్టిటిస్
ఇంటర్స్టీషియల్ సిస్టిటిస్ కారణంగా కూడా చాలా మంది పదేపదే మూత్ర విసర్జనకు వెళుతుంటారు. దీనివల్ల అసౌకర్యం గా ఉంటుంది. అలాగే తట్టుకోలేని నొప్పి కూడా వస్తుంది.
గర్భధారణ సమయంలో
గర్భధారణ సమయంలో కూడా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో పదేపదే మూత్రం రావడం చాలా కామన్. ఈ సమయంలో మూత్రాశయం బాగా సంకోచిస్తుంది. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
మూత్రపిండాల వ్యాధి
మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఉన్నా కూడా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల ఈ సమస్య రావడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితిలో మీరు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
డయాబెటీస్
డయాబెటీస్ కూడా తరచుగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది. ఈ వ్యాధిలో మూత్రాశయం సంకోచించబడుతుంది. ఇది తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. డయాబెటిక్ పేషెంట్లలో మూత్ర విసర్జనకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉంటాయి.