Asianet News TeluguAsianet News Telugu

‘బాహుబలి’ చేతుల మీదుగా ‘మహానుభావుడు’ పాటలు

  • మహానుభావుడిగా వస్తున్న శర్వానంద్
  • శర్వానంద్ సరసన ఆడి పాడనున్న మెహరీన్
  • దసరా కానుకగా మహానుభావుడు
prabhas for mahanubhavudu audio event

వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ కథనాయకుడు శర్వానంద్. ఈ ఏడాది శతమానం భవతి సినిమా హిట్ కొట్టిన ఆయన.. ఇప్పుడు ‘మహానుభావుడు’ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ వారం  ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి బాహుబలి ప్రభాస్.. ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

 

రొమాంటింక్-కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేం మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ‘ఆబ్ సెన్సివ్ కంపల్సివ్ డిసార్డర్’ అంటే అతి శుభ్రత అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో మారుతి దర్శకత్వంలో వచ్చిన  భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాని మతిమరుపు వ్యక్తిగా నటించి నవ్వించారు. ఇప్పుడు శర్వానంద్ అతిశుభ్రతతో నవ్వించడానికి ముందుకు వస్తున్నారు.

 

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ ప్రధాన పాత్ర పోషించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios