ఫ్యాషన్ డిజైనర్ తో డైరెక్టర్ కు లింక్ ఏంటో..?

popular director who's busy promoting a fashion designer
Highlights

చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ దర్శకుడు ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలను డైరెక్ట్ చేస్తూనే స్టార్ హీరోలకు వల వేస్తున్నాడు. గతంలో ఓ సీనియర్ హీరోని కూడా డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు.

చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ దర్శకుడు ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలను డైరెక్ట్ చేస్తూనే స్టార్ హీరోలకు వల వేస్తున్నాడు. గతంలో ఓ సీనియర్ హీరోని కూడా డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఓ పనిలో బిజీగా ఉంటున్నాడట ఈ డైరెక్టర్. ఇంతకీ ఆ పని ఏంటంటే..

ఇండస్ట్రీకు వచ్చి ఫ్యాషన్ డిజైనర్ గా సెటిల్ అవుదామాని చూస్తోన్న ఓ డిజైనర్ అమ్మాయిని తన సినిమాలలో అవకాశాలు ఇప్పించడంతో పాటు ఆమెను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడట. ఈ మధ్య ఓ పెద్ద బడ్జెట్ సినిమాకు కూడా పని చేసింది. రీసెంట్ గా విడుదలై ఫ్లాప్ అయిన ఓ సినిమాకు ఈమె పని చేసినందుకు నిర్మాతను రెమ్యునరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేసిందట.

సినిమా పూర్తయిన తరువాత ఆమె చూపించిన కాస్ట్యూమ్ బిల్స్ కు సదరు చిత్ర నిర్మాత షాక్ అయ్యాడట. కానీ ఈ డైరెక్టర్ మొహం చూసి ఏం అనలేకపోతున్నారట. బయటకు ఆమె ఆ డైరెక్టర్ తన కజిన్ అని చెబుతునప్పటికీ ఇద్దరూ రెండు వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో ఆమె అబద్దం చెబుతోందనే విషయం  స్పష్టమవుతోంది. హైటెక్ సిటీలో ఆమె కోసం డైరెక్టర్ గారు ఫ్లాట్ కూడా తీసుకున్నారని టాక్.   

loader