MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bigg Boss Agnipariksha: సంచాలక్ గా అపూర్వ పరువు పాయే, ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల

Bigg Boss Agnipariksha: సంచాలక్ గా అపూర్వ పరువు పాయే, ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో 8వ ఎపిసోడ్ లో మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ప్రియా, మర్యాద మనీష్, విన్నర్ కళ్యాణ్ పడాల సందడి చేశారు. అపూర్వకి ఈ ఎపిసోడ్ లో అస్సలు ఏమీ కలసి రాలేదు.

3 Min read
Author : Tirumala Dornala
Published : Aug 22 2026, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Agnipariksha
Image Credit : Asianet News

Bigg Boss Agnipariksha

బిగ్ బాస్ షోకి ముందు జరిగే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో 8వ ఎపిసోడ్ రణరంగాన్ని తలపించింది. 15 మంది కంటెస్టెంట్స్ మధ్య అసలైన పోటీ షురూ అయింది. కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టడానికి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్, విన్నర్ ఎంట్రీ ఇచ్చారు. నవదీప్ రాగానే ఒక బ్రీఫ్ కేస్ తో ఎంట్రీ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అర్హత లేనిది ఎవరికి ?
Image Credit : Asianet News

అర్హత లేనిది ఎవరికి ?

ఆ బ్రీఫ్ కేస్ లో ఫైర్ కార్డులు ఉంటాయి. అవి గెలుచుకున్న వారికి అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి అని నవదీప్ ఆఫర్ ఇచ్చారు. ఈ గేమ్ అందించడానికి ముందుగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ప్రియా ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాగానే కంటెస్టెంట్స్ కి ఫిట్టింగ్ పెట్టింది. ఇక్కడ ఉండడానికి అర్హత లేని కంటెస్టెంట్ ఎవరు అంటూ రాజా కుమారిని అడిగింది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అపూర్వ అని సమాధానం ఇచ్చింది. ఆమె వెనుకబడ్డ ప్రతి సారీ రీజన్స్ వెతుక్కుంటూ ఉంటుంది అని అందుకే ఆమె డిజర్వ్ కాదు అని పేర్కొంది.

Related Articles

Related image1
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
Related image2
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
35
రాజా కుమారికి మొదటి ఫైర్ కార్డు
Image Credit : Asianet News

రాజా కుమారికి మొదటి ఫైర్ కార్డు

మొదటి పవర్ కార్డు పోటీదారులుగా రాజా కుమారి, చరణ్, అపూర్వ లని ఎంచుకున్నారు. ముగురుకి మూడు బోర్డులు మీద నంబర్స్ ఉంటాయి. కింద రెండు బెలూన్స్ కి గాలి నింపడానికి పంప్ సెట్ చేసి ఉంటారు. పోటీదారులు ఒక నంబర్ ని ఎంచుకుని అన్నిసార్లు బెలూన్ కి గాలి పంప్ చేయాలి. నంబర్ 10 ఎంచుకుంటే 10 సార్లు చేయాలి. అలా బోర్డు మీద నంబర్స్ అన్నీ అయిపోయే వరకు చేస్తూ ఉండాలి. ఎవరు గాలి పంప్ చేస్తున్నప్పుడు బెలూన్ పగిలిపోతుందో వాళ్ళు అవుట్ అవుతారు. ఈ గేమ్ లో ముందుగా అపూర్వ అవుట్ అయింది. ఆ తర్వాత చరణ్ కూడా అవుట్ కావడంతో చివరికి రాజా కుమారి విజేతగా నిలిచారు. మొదటి ఫైర్ కార్డు సొంతం చేసుకున్నారు.

45
వాళ్ళు అన్ ఫెయిర్ గేమ్ ఆడినా గెలిచిన దీపక్
Image Credit : Asianet News

వాళ్ళు అన్ ఫెయిర్ గేమ్ ఆడినా గెలిచిన దీపక్

ఆ తర్వాత అగ్నిపరీక్ష స్టేజీపైకి మాజీ కంటెస్టెంట్ మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చారు. హేమంత్, గాయత్రీ, దీపక్ లని పోటీ దారులుగా ఎంచుకున్నారు. పేపర్ ఫిష్ లు ఫ్లోర్ పైన ఉంటాయి. వాటిని గాలితో విసురుతూ ఎవరికి కేటాయించిన పాన్ వాళ్ళు పడేలా చేయాలి. ముందుగా ఎవరి కలర్ ఫిష్ లని వాళ్ళు ఎంచుకుని ఉంటారు. వారికి కేటాయించిన ఫిష్ లు ఎవరివి ఎక్కువ ఉంటే వాళ్ళే విజేతలు. హేమంత్ , గాయత్రీ ఇద్దరూ దీపక్ పాన్ లోని ఫిష్ లని పక్కకి తోసేయడానికి ట్రై చేసి అన్ ఫెయిర్ గేమ్ ఆడారు. అయినప్పటికీ ఈ టాస్క్ లో దీపక్ విజయం సాధించాడు. రెండవ పవర్ కార్డు సొంతం చేసుకున్నాడు.

55
పరువు పోగొట్టుకున్న అపూర్వ
Image Credit : Asianet News

పరువు పోగొట్టుకున్న అపూర్వ

ఆ తర్వాత స్టేజీపైకి బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్.. కంటెస్టెంట్స్ ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఒక వేళ మీరు బిగ్ బాస్ 10 లో చివరి దశలో ఉన్నప్పుడు టైటిల్ వదులుకుంటే సినిమా ఆఫర్ ఇస్తా అని బిగ్ బాస్ చెబితే ఎం చేస్తారు అని ప్రశ్నించారు. దీనికి మిథిలేష్ సమాధానం ఇస్తూ సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ తో ఛాన్స్ అయితే తప్పకుండా బిగ్ బాస్ వదిలేస్తా అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత చివరికి గేమ్ మొదలైంది. అమన్, మిథిలేష్, రోహిత్ పోటీదారులు. ఇసుకలో ఫ్లాగ్ ని ఫిక్స్ చేసే రాడ్స్, ఫ్లాగ్ ఉంటుంది. వాటిని వెతికి తీసుకుని ముందుగా ఎవరు ఫిక్స్ చేసి జెండా పాతితే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళతారు. ఈ టాస్క్ లో అమన్, దీపక్ విజయం సాధించారు. మిథిలేష్ అవుట్. దీపక్, అమన్ మధ్య రెండవ రౌండ్ రణరంగాన్ని తలపించింది. బయట ఉన్న పిల్లోస్ ని ఎవరి ప్లేస్ లలో వాళ్ళు పెట్టాలి. బజర్ ఎండ్ అయ్యే టైంకి ఎవరి వద్ద ఎక్కువ పిల్లోస్ ఉంటే వల్లే విజేతలు. ఈ టాస్క్ లో పిల్లోస్ కోసం అమన్, దీపక్ బాగా ఫిజికల్ అటాక్ చేసుకున్నారు. ఈ టాస్క్ కి అపూర్వ సంచాలక్ గా వ్యవహరించారు. టాస్క్ అయ్యాక ఎవరు విజేత అని శ్రీముఖి సంచాలక్ అపూర్వ ని అడిగింది. అమన్ వద్ద ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి. కానీ అమన్ ఎక్కువగా ఫిజికల్ కావటానికి ట్రై చేశాడు. కాబట్టి విజేత రోహిత్ అని ప్రకటించింది. దానికి జడ్జెస్, శ్రీముఖి ఒప్పుకోలేదు. రూల్స్ ప్రకారం అమన్ వద్ద ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి కాబట్టి అతడే విజేత అని ప్రకటించారు. సంచలాక్ గా అపూర్వ ఫెయిల్ అయినట్లు శ్రీముఖి పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Heroines: రష్మికకి నయనతార బిగ్‌ షాక్‌, శ్రీలీల ఔట్‌.. సమంత, కాజల్‌, సాయిపల్లవి స్థానాలివే.. టాప్ ఎవరంటే?
Recommended image2
Irumudi Day 1 Collections: ఇరుముడి బాక్సాఫీసు వద్ద ఊచకోత, రవితేజ కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. చిరంజీవి రికార్డు బ్రేక్‌
Recommended image3
Chiranjeevi: చిరంజీవి డేట్స్ ఇవ్వకపోతే నాగార్జున, వెంకటేష్‌ హీరోలయ్యారు.. ఏఎన్నార్‌ మూడేళ్లు తిరిగాడు
Related Stories
Recommended image1
Chaitu - Akhil: అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారా ?
Recommended image2
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved