చరణ్ ను చూసి జలస్ ఫీల్ అయిన పవన్

First Published 3, Apr 2018, 3:12 PM IST
Pawan kalyan Compliments to Ram charan For Rangasthalam
Highlights
చరణ్ ను చూసి జలస్ ఫీల్ అయిన పవన్

 

రామ్ చరణ్ మూవీ రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో అబ్బాయ్ చరణ్ మూవీని బాబాయ్ పవన్ కళ్యాణ్ చూశాడనే న్యూస్ వైరల్ అయింది. ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. 

నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ మూవీకి తాను నిర్మాత కావడంతో.. ఆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు కానీ.. వేరే ఎక్కడా సినిమాల గురించి మాట్లాడినదే లేదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ ని పీక్స్ తీసుకెళ్లిపోయి.. నటుడిగా అనేక శిఖరాలు ఎక్కించేసిన రంగస్థలం మూవీని.. పవన్ కళ్యాణ్ బాబాయ్ కోసం ప్రత్యేకంగా షో వేసి మరీ చూపించాడు చరణ్. ఈ సినిమా అంతటినీ ప్రత్యేకంగా చూశాడట పవర్ స్టార్. ప్రతీ సన్నివేశంలోను ఎగ్జయిట్ అయ్యాడట. చిట్టిబాబు పాత్రలో పూర్తిగా లీనమైపోయిన చరణ్ ను వేనోళ్ల పొగిడేశాడట. అంతే కాదు.. తన కెరీర్ మొత్తంలో ఇలాంటి సినిమా ఒకటి కూడా రాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట పవన్. 

ట్విట్టర్ సాక్షిగా 'శ్రీ రామ్ చరణ్ గారికి' అంటూ సంబోధించి అభినందనలు తెలిపినా.. డైరెక్టుగా మాత్రం 'నువ్వు లక్కీరా. ఇలాంటి సినిమా ఒక్కటి రాలేదు నా దగ్గరకి' అనేశాడట పవన్. కోట్లాది మంది ఆరాధించే పవర్ స్టార్..తను ఎంతగానో మెచ్చే బాబాయ్ నోటి నుంచి అంతటి మాట వచ్చేసరికి.. రామ్ చరణ్ తేజ్ ఫుల్లు ఖుషీ అయిపోయాడని సన్నిహితులు చెబుతున్నారు. 

 

loader