యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేశారని సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు త్రివిక్రమ్ వెల్లడించాడు. అందుకే ప్రతీ ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సినిమాలో హీరో వీర రాఘవ రెడ్డి పాత్ర ఎంతగా గుర్తుండిపోతుందో.. విలన్ బసిరెడ్డి పాత్ర కూడా ఆడియన్స్ కి అంతే గుర్తుంటుంది. ఆ పాత్రలో జగపతిబాబు నటన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే జగపతిబాబు ఈ సినిమా కోసం ఎంత డెడికేటెడ్ గా పని చేశారనే విషయాన్ని గుర్తు చేసుకున్న తారక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

''నేను ఒకరోజు డబ్బింగ్ థియేటర్ కి వెళ్లాను. అక్కడ డబ్బింగ్ ఇన్‌చార్జి నాతో బాబు మీకొకటి చూపించాలని చెప్పి ఓ టిష్యూ పేపర్ తీసుకొచ్చి చూపించాడు. దాని మీద చిన్న చిన్న బ్లడ్ డ్రాప్స్ ఉన్నాయి. ఏంటిది అనడిగా.. దానికి సమాధానంగా జగపతిబాబు గారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే దగ్గు వచ్చేసి లోపల ఉన్న రప్చర్ కూడా బయటకి వచ్చేసిందని చెప్పాడు. 

నేను వెంటనే త్రివిక్రమ్ కి ఫోన్ చేసి ఆయనకి దగ్గేసి బ్లడ్ వస్తుందనుకుంటా.. నాకు భయం వేస్తోందని చెప్పాను. అది ఆయనకున్న డెడికేషన్'' అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు..

హాట్ టాపిక్ గా మారిన బాలయ్య, ఎన్టీఆర్ ల మిడ్ నైట్ పార్టీ!

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!