'బాహుబలి' సినిమా ఐటెం గాళ్ గా పాపులర్ అయిన నోరా ఫతేహి స్విమ్మింగ్ ఫూల్ ఇలా ఫోజిచ్చింది. మొన్నామధ్యన స్విమ్మింగ్ పూల్ పక్కనే పింకు రంగు బికినీలో ఛముక్కులు కురిపించిన నోరా.. 'నా ట్రైనింగ్ సెషన్ను నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను' అంటూ కామెంట్ చేసింది. ఇప్పుడు ఆ సోయగాల తాలూకు ఊరింపు చూసి తట్టుకోలేక.. అలాగే సమ్మర్ ముందు ఈమె కురిపిస్తున్న వేడి తాపాన్ని ఆస్వాదించలేకా కుర్రాళ్ల సతమతమవుతున్నారు. నిజానికి ఈ మధ్యన ఒక బెల్లి డ్యాన్స్ సాంగ్ చేయడం కోసం వెయిట్ పెరిగింది నోరా. ఆ తరువాత మళ్ళీ సన్నబడుతూ.. ఇలా టీజ్ చేస్తోంది మొరాకోకు చెందిన ఈ హాట్ వన్నెలాడి. 

తెలుగులో టెంపర్.. లోఫర్.. బాహుబలి.. కిక్ 2 వంటి సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసిన నోరా.. ఎందుకో పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇక హిందీలో కూడా అప్పుడప్పుడూ అక్కడక్కడా కొన్ని పాటల్లోకనిపిస్తూ.. కొన్ని ఈవెంట్లలో తన డ్యాన్సులతో మతిపోగొట్టేస్తూ కాలక్షేపం చేస్తోంది. ఎంతైనా కూడా పరాయి దేశం నుండి ముంబాయ్ వచ్చి.. ఏదో విధంగా ఇక్కడ మకాం వేయడం పెద్ద విషయమేలే.