Asianet News TeluguAsianet News Telugu

ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన హీరోలు ఎవరని గూగుల్ లో వెతికా, ఆ మూవీ ఎఫెక్ట్ కి వారం రోజులు నిద్ర లేదు: నితిన్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ' మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ మంచి హైప్ తీసుకువచ్చాయి.

Nithiin reveals interesting details about Macherla Niyojakavargam
Author
First Published Aug 10, 2022, 7:11 AM IST

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ' మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ మంచి హైప్ తీసుకువచ్చాయి. ఆగష్టు 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం నితిన్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

తాజా ఇంటర్వ్యూలో నితిన్ మూవీ గురించి అనేక విశేషాలు తెలిపారు. మాచర్ల నియోజకవర్గం ఫిక్షనల్ స్టోరీ. శేఖర్ గుంటూరుకి చెందిన వ్యక్తి. మాచర్ల టైటిల్ లో ఒక ఫోర్స్ ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఈ చిత్రం కోసం శేఖర్ కొంతమంది ఐఏఎస్ అధికారులని కూడా కలిశారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని స్టడీ చేశారు. క్లాస్ గా ఉండే ఐఏఎస్ అధికారులు ఎప్పుడు కోపంగా ఉంటారు.. వాళ్ళ వర్క్ స్టయిల్ ఎలా ఉంటుంది అనే విషయంపై స్టడీ చేశాం. 

రాజప్ప పాత్ర కోసం సముద్రఖని గారికి కథ చెప్పినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ తమ ఊర్లో కూడా జరిగింది అని అన్నారు. ఇక కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ అర్థం కాని విధంగా ఉంది. ఎలాంటి సినిమాని ఆదరిస్తున్నారో తెలియడం లేదు. టీజర్, ట్రైలర్స్ లో ఏమైనా నచ్చితేనే థియేటర్ కి వస్తున్నారు అని నితిన్ తెలిపాడు. 

నా ఇరవై ఏళ్ల కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ రెండూ ఉన్నాయి. ప్రస్తుతం నా పొజిషన్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనేది నా ప్లాన్ అని నితిన్ తెలిపారు. ఫ్లాప్ సినిమాలు పడ్డప్పుడు చాలా బాధ పడే వాడిని. నితిన్ కెరీర్ లో దాదాపు పదేళ్లు హిట్స్ లేవు. ఇష్క్ చిత్రం నితిన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్. 

ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన హీరోలు ఎవరు అని గూగుల్ లో వెతికేవాడిని. హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల పేర్లు కనిపించేవి. వాళ్లనే ఆదర్శంగా తీసుకున్నాను అని నితిన్ తెలిపారు. ఇటీవల తనకు విక్రమ్ మూవీ చూశాక వారం రోజుల పాటు నిద్ర పట్టలేదు అని నితిన్ అన్నారు. 

సినిమా అంటే ఇలా ఉండాలి కదా, ఇలా తీయాలి కదా అని అనుకున్నా. మూస ఫార్ములా పక్కన పెట్టి కథని నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి అని నితిన్ అన్నారు. ఫ్యూచర్ లో అలాంటి కథలు దొరికితే తప్పకుండ సినిమా చేస్తా అని నితిన్ అన్నారు. మాచర్ల తర్వాత నితిన్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios