త్వ‌ర‌లొనే ఒక్క‌టికానున్న హిరో నాగ‌చైత‌న్య సమంత‌ జ‌న‌వ‌రి 29 న చైతూ,సమంత ఎంగేజ్ మెంట్ ఇటీవలే అక్కినేని అఖిల్ నిశ్చితార్థపు వేడుక వైభ‌వంగా జ‌రిగింది
విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెలలోనే చైతూ-సమంత నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. 2017 జనవరి 29 వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. అంటే ఆ కార్యానికి మరెంతో దూరం లేనట్టే!
ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. వివాహ పద్ధతి విషయంలో తమ్ముడు అఖిల్ నే అనుసరించనున్నాడట చైతూ. ఈ హీరోది, ఇతడి హీరోయిన్ వివాహం కూడా.. డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలోనే జరగనున్నట్టుగా తెలుస్తోంది.
